Nayanatara : చిరంజీవి సినిమాలో నయన్‌కి భారీ పారితోషికం

నయన్ మామూలుగానే తమిళ్ సినిమాల్లో సినిమాకి 5 కోట్లకు పైగానే తీసుకుంటుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలైతే మరింత ఎక్కువ డిమాండ్ చేస్తుంది. నయన్ కి ఉన్న క్రేజ్, మార్కెట్ చూసి నిర్మాతలు

Nayanatara : చిరంజీవి సినిమాలో నయన్‌కి భారీ పారితోషికం

Nayanatara

Nayanatara :  లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు స్టార్ హీరోల‌తో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సౌత్ లో బాగా క్రేజ్ సంపాదించుకుంది న‌య‌న‌తార. నయనతార డైరెక్ట్ తెలుగు సినిమాలలో కనపడి చాలా కాలమే అవుతుంది. ‘సైరా’ సినిమాలో చిరంజీవికి జంటగా నటించింది నయనతార. ఆ తర్వాత అన్ని డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో పలకరిస్తుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పింది నయనతార.

Tara Sutaria : పెళ్లి పీటలెక్కుతున్న మరో బాలీవుడ్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ లూసిఫ‌ర్ లో ఓ స్పెషల్ పాత్రని మంజు వారియర్ పోషించింది. ఇప్పుడు ఈ రీమేక్ లో ఆ పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. అయితే ఇపుడు న‌య‌న‌తార ‘గాడ్ ఫాద‌ర్’ సినిమాకు తీసుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

Samantha : సమంత నయనతార కౌగిలింత.. మధ్యలో నయన్ ప్రియుడు

నయన్ మామూలుగానే తమిళ్ సినిమాల్లో సినిమాకి 5 కోట్లకు పైగానే తీసుకుంటుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలైతే మరింత ఎక్కువ డిమాండ్ చేస్తుంది. నయన్ కి ఉన్న క్రేజ్, మార్కెట్ చూసి నిర్మాతలు కూడా నయన్ అడిగిన అమౌంట్ కి ఓకే చెప్తున్నారు. సౌత్ హీరోయిన్స్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయన్ రికార్డు సృష్టించింది.

RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

తాజాగా ‘గాడ్ ఫాదర్’ సినిమాకి నయన్ దాదాపు 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. తెలుగులో ఒక హీరోయిన్ కి ఇంత ఇవ్వడం ఇదే మొదటి సారి. న‌య‌న్ ఈ చిత్రానికి దాదాపు రూ.4 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు సమానంగా ఉండే పాత్రలో కనిపిస్తుంది. దాంతో రెమ్యున‌రేష‌న్ ఈ మాత్రం తీసుకోకపోతే ఎలా అని అనుకుంటున్నారు సినీ ప్రియులు. మొన్న న‌య‌న‌తార బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘గాడ్ ఫాదర్’ సినిమా బృందం నయన్ కి విషెష్ తెలిపారు.