Nayan-Vignesh: శ్రీవారి సాక్షిగా.. నయన్-శివన్ కథ శుభం కార్డు!

ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ నయన్, విఘ్నేశ్ తో పాటూ ఈ జంట ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పాటేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. వేదికను సెట్ చేసుకుంటున్నారు.

Nayan-Vignesh: శ్రీవారి సాక్షిగా.. నయన్-శివన్ కథ శుభం కార్డు!

Nayan-Vignesh: ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ నయన్, విఘ్నేశ్ తో పాటూ ఈ జంట ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పాటేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. వేదికను సెట్ చేసుకుంటున్నారు. ఎంగేజ్ మెంట్ ఎప్పుడో కానిచ్చిన నయన్, విఘ్నేశ్ పెళ్లి చేసేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే రూమర్స్ కు మొత్తంగా చెక్ పెట్టేసారు. ఆ డిటేల్స్ పై హావ్ ఎ లుక్…

Nayan-Vignesh: పెళ్లి పీటలేక్కబోతున్న నయన్.. ముహూర్తం ఎప్పుడంటే?

పెళ్లి కాలేదు.. కానీ గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్‌బర్డ్స్ గా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. బర్త్ డేస్, ఫెస్టివల్స్, న్యూ ఇయర్.. ఏవైనా కలిసే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. వెకేషన్ కు వెళ్తున్నారు.. గుళ్లూ గోపురాల దర్శనం చేసుకుంటున్నారు. కానీ పెళ్లప్పుడంటే మాత్రం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నయన్, విఘ్నేశ్ శివన్ ఇప్పుడు బదులిచ్చారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నమని చెప్పి ఈ వీకెండ్ లో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.

Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..

అదిగో పెళ్లి.. ఇదిగో ప్రెగ్నెన్సీ అని నయన్ పై రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎంగేజ్ చేసుకున్నామని రింగ్ చూపించి మరీ కన్ఫర్మ్ చేసిన నయన్.. జూన్ 9న పెళ్లికూతురులా మారబోతుంది. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకునే ముందు దోష నివారణ పూజలు సైతం పూర్తి చేశారు వీళ్లు. తమిళనాడులోని పలు ఆలయాలతో పాటూ షిరిడీ, శ్రీకాళహస్తి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేసారు. మొత్తానికి 7 సంవత్సరాల రిలేషన్ షిప్ కి పెళ్లి బంధాన్ని యాడ్ చేయబోతున్నారు.

Nayanathara : ప్రియుడితో దుబాయిలో న్యూ ఇయర్ చేసుకున్న నయనతార

నయన్ క్రిస్టియన్.. విఘ్నేశ్ శివన్ హిందూ. అయితే జూన్ 9వ తేదీన తిరుమలలో వీరి పెళ్లి పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరుగబోతుంది. వివాహ వేదికతో పాటూ ఇతర ఏర్పాట్ల కోసం తిరుమలలో నయనతార పర్యటించారు. చెన్నై కలిగమ్మాల్ టెంపుల్ లో సింధూరం ధరించి బయటికొచ్చిన నయన్ ను చూసి రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్.. ఇకపై విఘ్నేశ్ భార్యగా నిజంగానే సింధూరం ధరించాల్సి వస్తుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శింభు, ప్రభుదేవా లాంటి వారితో బ్రేకప్స్ తో ఓ ట్రాజెడీ స్టోరీని చూపించిన నయన్ లైఫ్ లోకి విఘ్నేశ్ ఎంటరవడం.. వీరి ఇన్నేళ్ల ప్రేమాయణానికి తిరుమల శ్రీవారి ఎదుట వెడ్డింగ్ కార్డ్ పడటం నిజంగా విశేషమే.