Nayanathara : ప్రియుడితో దుబాయిలో న్యూ ఇయర్ చేసుకున్న నయనతార

నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఇటీవల ఇద్దరూ.........

 

Nayanathara :  గత రెండు రోజుల నుంచి అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇక సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా చేసుకోడానికి వేరే దేశాలకి కూడా వెళ్లారు. కొంతమంది తమ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు. తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకల్ని వేరే దేశాల్లోనే జరుపుకున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ లో జరుపుకుంది.

Karate kalyani : నన్ను చంపాలని చూస్తున్నారు : కరాటే కళ్యాణి

నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఇటీవల ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ లవ్ బర్డ్స్ కలిసే కనిపిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఈ న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో జరుపుకున్నారు. దుబాయిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకల్ని చేసుకొని బుర్జ్ ఖలీఫా దగ్గర వీరిద్దరూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతారు పెళ్లి తొందరగా చేసుకోండి అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు