Netrikann : నయనతార నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్..

నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నారు..

Netrikann : నయనతార నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్..

Netrikann

Netrikann: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్.. స్టార్‌ హీరోయిన్‌ నయనతార మెయిన్ లీడ్‌లో నటిస్తున్న సినిమా ‘నెట్రికన్’.. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. సిద్దార్థ్ నటించిన ‘గృహం’ చిత్రంతో ప్రశంసలందుకున్న మిలింద్‌ రౌ దర్శకత్వం వహిస్తున్నారు.

Netrikann : నయనతార ‘నెట్రికన్’ కూడా ఓటీటీలోనే..

‘వసంతకాలం’ మూవీలో బధిర (వినికిడి మరియు మాట్లాడలేని) పాత్రలో ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నారు. గురువారం ‘నెట్రికన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నయనతార పర్ఫార్మెన్స్‌తో ట్రైలర్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి హింసించే ఓ సైకో కన్ను కథానాయికపై పడితే.. అతని నుండి తప్పించుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసిందనే కథాంశంతో ఆసక్తికరంగా తెరకెక్కుతుంది ‘నెట్రికన్’..

Nayanthara – Vignesh: నయనతార పేరు మార్చుకుంది.. పెళ్లికి రెడీ అయ్యారా..?

సైకో క్యారెక్టర్‌లో అజ్మల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆర్.డి. రాజశేఖర్ విజువల్స్, గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నయనతార తొలిసారి అమ్మవారి పాత్రలో నటించిన ‘అమ్మోరు తల్లి’ సినిమాలాగే ఈ మూవీ కూడా ఓటీటీ రిలీజ్‌కే ఓటు వేసింది. ఆగస్టు 13 నుండి ‘నెట్రికన్’ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.