Nayan Vignesh: సరోగసీతో తల్లి కాబోతున్న నయన్.. క్లారిటీ ఇదే

సరోగసి పద్ధతిలో నయనతార తల్లిగా మారబోతుందా.. విఘ్నేశ్ శివన్ తో నయన్ పెళ్లి సీక్రెట్ గా జరిగిపోయిందా.. ఇప్పుడివే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. అవలా ఉండగానే..

Nayan Vignesh: సరోగసీతో తల్లి కాబోతున్న నయన్.. క్లారిటీ ఇదే

Nayan

Nayan Vignesh: సరోగసి పద్ధతిలో నయనతార తల్లిగా మారబోతుందా.. విఘ్నేశ్ శివన్ తో నయన్ పెళ్లి సీక్రెట్ గా జరిగిపోయిందా.. ఇప్పుడివే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. అవలా ఉండగానే ఈ రొమాంటిక్ కపుల్ పై పోలీస్ కేస్ ఫైల్ అయిందన్న గాసిప్స్ పుట్టుకొచ్చాయి. మరి సరోగసి మాట నిజమేనా.. పోలీస్ కేస్ సంగతేంటి..?

Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..

ఓ వీడియో కారణంగానే నయనతార సీక్రెట్ మ్యారేజ్, సరోగసి అనే వార్తలు ఫుల్ గా వైరలవుతున్నాయి. తమిళనాడు కలిగంబాల్ టెంపుల్ నుంచి నయన్-విఘ్నేశ్ బయటికొస్తుండగా తీసిన వీడియోలో నయన్ నుదుటున సింధూరం కనిపించడంతో ఆమెకు విఘ్నేశ్ తో పెళ్లయిపోయిందనే గాసిప్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత వెంటనే సరోగసి పద్ధతి ద్వారా నయన్-విఘ్నేశ్ ఓ బేబీని కనాలనుకుంటున్నారని కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించింది.

Nayanathara : దుబాయ్‌లో ప్రియుడితో నయనతార న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

నయన్ పెళ్లి, సరోగసి వంటి వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ తో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి గుళ్లూ గోపురాలు సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నమాట వాస్తవం. అయితే ఆ పూజల్లో భాగంగా నుదుటిపై బొట్టు పెట్టుకుంటే పెళ్లైపోయిందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. అటు వీళ్లు పేరెంట్స్ కావాలనుకుంటున్న మాటల్లో కూడా అస్సలు నిజం లేదని తెలుస్తోంది.

Nayanathara : కొత్త బిజినెస్ ప్రారంభించిన నయన్.. ఇక అమ్మాయిలంతా ఇవే ప్రొడక్ట్స్

కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది ఈ జంట. విజయ్ సేతుపతి, నయన్, సమంతా కాంబోలో కాదువాక్కుల రెండు కాదల్ తర్వాత అజిత్ 62వ సినిమాకు కమిటయ్యాడు విఘ్నేశ్ శివన్. అజిత్ మూవీలో హీరోయిన్ గా నటించబోతున్న నయనతార ఇటు తెలుగులో గాడ్ ఫాదర్.. తమిళ్ లో కనెక్ట్ మూవీ చేస్తోంది. బాలీవుడ్ లో అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ సరసన నటిస్తోంది. కొన్ని మలయాళ సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి. సో ఇంత బిజీగా ఉన్న టైమ్ లో పెళ్లి, పిల్లల గురించి నయన్ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకొలేదని తెలుస్తోంది. గతంలో చెప్పినట్టు ఎంగేజ్ మెంట్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగినా.. పెళ్లి మాత్రం అందరికీ చెప్పే చేసుకుంటుందని చెప్తున్నారు.

Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

నయన్-విఘ్నేశ్.. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్యానర్ పేరు రౌడీ పిక్చర్స్ అని పెట్టి.. రౌడీయిజాన్ని ప్రొత్సహిస్తున్నారని వీళ్లపై పోలీస్ కేసు ఫైలయినట్టు తెలుస్తోంది. అలాగే అజిత్- విఘ్నేశ్ శివన్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన రోజు ఫైర్ క్రాకర్స్ కాల్చి విఘ్నేశ్ ఇబ్బంది పెట్టాడని కూడా కేస్ నమోదు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ పోలీస్ కంప్లైట్స్ పై ఎలాంటి అఫీషియల్ స్టేట్ మెంట్స్ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జోరుగా నడుస్తోంది.