బాలయ్య థాయ్‌లాండ్ నుండి తిరిగొస్తున్నాడు

NBK 105 : 20 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో రెండు సాంగ్స్, ఓ ఫైట్‌తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది..

  • Published By: sekhar ,Published On : August 30, 2019 / 03:32 AM IST
బాలయ్య థాయ్‌లాండ్ నుండి తిరిగొస్తున్నాడు

NBK 105 : 20 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో రెండు సాంగ్స్, ఓ ఫైట్‌తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది..

జై సింహా తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో సినిమా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో స్టార్ట్ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వేదిక,  సోనాల్ చౌహాన్ హీరోయిన్స్.. భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రధారులు.. 20 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో రెండు సాంగ్స్, ఓ ఫైట్‌తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

2020 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. కథ : పరుచూరి మురళిమాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..