బాబు రెడీ బాబు : బాలయ్య 106 ఫిక్స్

నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న హ్యాట్రిక్ ఫిలిం..

  • Edited By: sekhar , August 30, 2019 / 11:40 AM IST
బాబు రెడీ బాబు : బాలయ్య 106 ఫిక్స్

నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న హ్యాట్రిక్ ఫిలిం..

నటసింహా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు.. రీసెంట్‌గా ఈ సినిమా థాయ్‌‌‌లాండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇంతలోనే తన 106వ సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడు బాలయ్య..

సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాకు గతకొద్ది రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తవడంతో త్వరలో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో.. బాలయ్య, బోయపాటిల మూవీని నిర్మించనున్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు నిర్మాణ భాగస్వామి అవుతారని తెలుస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ ఫిలిం గురించి అధికారిక ప్రకటన రానుంది.