NBK 107 : బాబు రెడీ బాబు.. యాక్షన్..

బాలయ్య - గోపిచంద్ మలినేని - మైత్రీ మూవీస్ సినిమా నవంబర్ 13న ప్రారంభం కానుంది..

NBK 107 : బాబు రెడీ బాబు.. యాక్షన్..

Nbk 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ‘అఖండ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ పేరుతో ఓ సాలిడ్ సెలబ్రిటీ టాక్ షో చేస్తున్నారు బాలయ్య. డిజిటల్ ఎంట్రీతోనూ తనకు సాటిలేదని ప్రూవ్

చేసుకున్నారు. భుజానికి సర్జరీ కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు.

బుధవారం సాయంత్రం NBK 107 అప్‌డేట్ ఇచ్చారు టీం. నవంబర్ 13 ఉదయం 10:26 గంటలకు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని తెలిపారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటిం స్టార్ట్ చేయబోతున్నారు. 2022 వేసవికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.