NBK 107 : ‘జై బాలయ్య’.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

బాలయ్య - గోపిచంద్ మలినేని, మైత్రీ మూవీస్ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ రిజిస్టర్ చేయించారని టాక్..

NBK 107 : ‘జై బాలయ్య’.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

Nbk 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ‘అఖండ’ షూటింగ్‌కి రీసెంట్‌గా గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సెలబ్రిటీ టాక్ షో షూటింగ్‌లో ఉన్నారు బాలయ్య.

Akhanda : గుమ్మడికాయ కొట్టేశారు.. గర్జనకు రెడీ..

కొంత గ్యాప్ తర్వాత, ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు.

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

రియల్ ఇన్సిడెన్స్ ఆధారంగా తెరకెక్కించిన ‘క్రాక్’ హిట్ అవడంతో మరోసారి వాస్తవిక సంఘటనలపై ఫోకస్ పెట్టారు గోపిచంద్. అందుకోసం కొంతకాలం బాగా రీసెర్చ్ చేశారు. పురాతన లైబ్రరీలలో తనకు కావలసిన సమాచారాన్ని సేకరించారు. ఈ మూవీలో నటసింహా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

ఈ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ రిజిస్టర్ చేయించారని ఫిలింనగర్ టాక్. బాలయ్య అభిమానులకు ‘జై బాలయ్య’ అనేది స్లోగన్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్.. కాబట్టి ఈ టైటిల్ పెడితే కచ్చితంగా సినిమా మీద హైప్ ఆకాశాన్నంటుతుంది అనడంలో సందేహం లేదు..

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!