బాలయ్యా.. అదిరిందయ్యా.. ఇప్పటివరకు చూడని లుక్!

బాలయ్యా.. అదిరిందయ్యా.. ఇప్పటివరకు చూడని లుక్!

Nbk Holi

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.

ఈ సంధర్భంగా బాలయ్య ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనగా.. బేబీ దిశ్నా అనే పాప అందరికీ రంగులు పూసి అల్లరి చేయడం ఆకట్టుకుంటోంది. బాలకృష్ణతో అల్లరి చేస్తూ.. పాప రంగులు అద్దుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలయ్య లుక్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉన్నది.. చాలా న్యాచురల్ లుక్‌లో బాలయ్య కనిపించాడు.

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది కాగా.. మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ బ్లాక్ బస్టర్స్ అయ్యాక.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనగా.. ఇందులో బాలకృష్ణది ఒకటి అఘోరా పాత్రగా.., మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర అని ప్రచారం సాగింది. అయితే అఘోరా పాత్రను పూర్తిగా మార్చేసి, ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో మార్చిన లుక్ ఇప్పుడు హోలీ సంబరాల్లో కనిపించిన లుక్‌యేనా? అని అభిమానులు అనుమానిస్తున్నారు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఉగాదికి అఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది.