NBK107: బాలయ్య సినిమా మ్యూజిక్ సిట్టింగ్.. దద్దరిల్లుతోందట!
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్....

NBK107: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంలో బాలయ్య ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ హంట్ అంటూ ఓ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌తో బాలయ్య మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు.
NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?
ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు గోపీచంద్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు. దీనికి సంబంధించి సంగీత దర్శకుడు థమన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. రామజోగయ్య శాస్త్రీ అద్భుతమైన లిరిక్స్‌కు అత్యద్భుతమైన సంగీతాన్ని థమన్ ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
NBK107: బాలయ్య అలాంటి డైలాగులు చెబుతాడా?
దీంతో బాలయ్య సినిమా కోసం థమన్ మరోసారి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడని.. ఈసారి కూడా థియేటర్లలో బాక్సులు బద్దలు కావాల్సిందే అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ నటిస్తుండగా, ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈసారి థమన్ ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమాలోని పాటలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
#NBK107 🧿🎵⭐️ Loving our Super Energetic Compositions with My Baws & @ramjowrites For Our #NataSimham 🦁 @MythriOfficial pic.twitter.com/q3JzgavLQK
— Gopichandh Malineni (@megopichand) June 21, 2022
1Prophet Comment Row : అమరావతి కెమిస్ట్ హత్య కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు-హోం మంత్రి అమిత్ షా
2PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
3Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!
4Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!
5Vasundhara Raje: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై చర్చించాం: వసుంధరా రాజే
6Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి
7BVR School : హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్
8Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?
9Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
10Yashwant Sinha: నామినేషన్ వేసి మోదీకి ఫోన్ చేస్తే.. అందుబాటులోకి రాలేదు – యశ్వంత్ సిన్హా
-
Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..
-
Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!
-
RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!