NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్....

NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?

Nbk107 Shoot To Happen In Turkey Instead Of Us

NBK107: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో మనకు కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలోని కొంతమేర షూటింగ్ ‌ అమెరికాలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది.

NBK107: బాలయ్య సినిమా మ్యూజిక్ సిట్టింగ్.. దద్దరిల్లుతోందట!

అయితే వీసా సమస్య వల్ల ఈ సినిమా షూటింగ్‌ను అమెరికాలో కాకుండా వేరొక దేశంలో నిర్వహించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యూఎస్‌లో జరుపుకోవాలని చూసిన షూటింగ్ పార్ట్‌ను టర్కీలో నిర్వహించాలని తమ ప్లాన్‌ను మార్చుకుంది చిత్ర యూనిట్. అక్కడ ఉన్న అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ షూటింగ్‌లో బాలయ్య, శ్రుతి హాసన్‌లతో పాటు పలువురు నటీనటులు పాల్గొంటారని చిత్ర యూనిట్ అంటోంది.

NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?

కాగా, బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు చిత్ర యూనిట్. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని.. ఆ తరువాత ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.