NBK108: ఫ్యాన్స్ గెట్ రెడీ.. NBK108 నుండి మరో బిగ్ అప్డేట్.. నిజమేనా?

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 108వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

NBK108: ఫ్యాన్స్ గెట్ రెడీ.. NBK108 నుండి మరో బిగ్ అప్డేట్.. నిజమేనా?

NBK108 Big Announcement On The Way

NBK108: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 108వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి ఇటీవల వరుసగా అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్, అంచనాలను మరింతగా పెంచేసింది.

NBK108: కొత్త లుక్‌లో కనిపించి స్టన్ చేసిన బాలయ్య

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో బాలయ్య సరికొత్త లుక్‌తో కనిపించి ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఆయన మునుపెన్నడూ కనిపించని విధంగా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఇప్పుడు మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనుందట.

NBK108: అన్న దిగుతుండు.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులకు ఎసరు పెడుతుండు!

ఈ సినిమాను ప్రస్తుతం NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, ఈ చిత్ర టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌తో ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట. మరి నిజంగానే ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.