NBK108: అఫీషియల్.. దసరాకు ఆయుధపుజ చేయనున్న బాలయ్య.. పూనకాలు తెప్పిస్తానంటోన్న అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

NBK108: అఫీషియల్.. దసరాకు ఆయుధపుజ చేయనున్న బాలయ్య.. పూనకాలు తెప్పిస్తానంటోన్న అనిల్ రావిపూడి

NBK108 Movie Locks Dussehra Release

NBK108: నందమూరి బాలకృష్ణ తన అభిమానులను వరుస అప్డేట్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య, తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాను NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

NBK108: బాలయ్య సినిమాలో కాజల్ అలాంటి పాత్రలో కనిపిస్తుందా..?

ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తానంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్‌ను నిజం చేస్తూ, ఆయన్ను సరికొత్త గెటప్‌లో చూపెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయదశమికి ఆయుధపూజ అంటూ బాలయ్య పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేస్తుండటంతో పండుగ వార్ మరింత రసవత్తరంగా మారింది.

NBK108: ఫ్యాన్స్ గెట్ రెడీ.. NBK108 నుండి మరో బిగ్ అప్డేట్.. నిజమేనా?

ఇక ఈ సినిమాలో బాలయ్య చేసే పాత్ర ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయని పాత్రగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ప్రేక్షకులకు.. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడటం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.