NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కథ వచ్చింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

NBK108: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కథ వచ్చింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

NBK108: బాలయ్య కోసం అనిల్ రావిపూడి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..?

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోగా, బాలయ్య ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ పడింది. నిజానికి బాలయ్య 108వ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 24 నుంచి మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి భావించాడు. కానీ, తారకరత్న మరణంతో ఈ షెడ్యూల్ వాయిదా పడింది. ఇక బాలయ్య ప్రస్తుతం తారకరత్నకు సంబంధించిన కర్మ కార్యక్రమాలను ముగించుకున్నాకే షూటింగ్‌లో పాల్గొంటాడు.

NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్..

దీంతో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను మార్చి 12 నుంచి మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. ఇక ఈ షెడ్యూల్‌లో బాలయ్య రెచ్చిపోయి నటించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.