NBK108: బాలయ్య సినిమాలో బాలీవుడ్ భామ విలనిజం..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

NBK108: బాలయ్య సినిమాలో బాలీవుడ్ భామ విలనిజం..?

NBK108 To Have Nora Fatehi In Negative Role

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

NBK108 : NBK108 షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..

కాగా, ఈ సినిమాలో బాలయ్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NBK108: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య సూపర్ హిట్ ట్రాక్ రీమిక్స్..?

ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్ర పూర్తి నెగెటివ్‌గా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తతో ఒక్కసారిగా NBK108 మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి నిజంగానే ఈ సినిమాలో బాలీవుడ్ భామ విలనిజం చేయనుందా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సి ఉంది.