కామెడి క్వీన్ భారతి సింగ్ అరెస్ట్ | NCB Arrests Comedian Bharti Singh

కామెడి క్వీన్ భారతి సింగ్ అరెస్ట్

కామెడి క్వీన్ భారతి సింగ్ అరెస్ట్

Bharti Singh Arrested: సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ మృతితో వెలుగు చూసిన డ్రగ్స్ కుంభకోణంతో హిందీ చిత్రసీమకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించగా, కొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కమెడియన్ భారతీ సింగ్‌‌ ను కొద్ది సేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.


ముంబైలోని NCB ప్రశ్నించిన తరువాత ఆమెను అరెస్టు చేశారు. ముంబైలోని ఆమె నివాసంపై ఈరోజు ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్‌ అధికారి తెలిపారు. భారతి సింగ్‌తో పాటు, ఆమె భర్త కూడా నిషేధిత పదార్థాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్‌ పేరు వెలుగులోకి రావడంతో, ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు జరిపింది. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది.


ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం భారతి సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. స్టేజ్ కమెడియన్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్ అరెస్టుతో బాలీవుడ్ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపడింది.

Bharti Singh Arrested

×