Ananya Panday : ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు

బాలీవుడ్ నటి, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాలో కనిపించబోతున్న హీరోయిన్ అనన్య పాండే ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసింది. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్

Ananya Panday : ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు

Ananya

Ananya Panday :  డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వడంతో బాలీవుడ్ మరోసారి షాక్ అయింది. గతంలో బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాలా మంది సెలబ్రిటీలని విచారించారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం, ఆర్యన్ ఖాన్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఎన్సీబీ మరోసారి బాలీవుడ్ పై పంజా విసిరింది. ఆర్యన్ ఖాన్ ఇంటితో పాటు ఆర్యన్ స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో ఎన్సీబీ సోదాలు చేస్తుంది.

Sharukh khan : జైల్లో ఆర్యన్ ని మొదటి సారి కలిసిన షారుఖ్.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాలో కనిపించబోతున్న హీరోయిన్ అనన్య పాండే ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసింది. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్, ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ లు స్నేహితులని.. అనన్య ఆర్యన్ తో డ్రగ్స్ విషయంలో చాట్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయని ఎన్సీబీ ఈ సోదాలని చేస్తుంది. డ్రగ్స్ కేసు విచారణ కోసం ఎన్‌సిబి అధికారులు అనన్య పాండే ఇంటికి చేరుకున్నారు. అధికారులు అనన్య పాండే ఇంట్లో సోదాలు చేశారు. అనన్యని కూడా ఈ డ్రగ్స్ కేసులో విచారించనున్నారు ఎన్సీబీ అధికారులు. అలాగే షారుఖ్ ఖాన్ ఇంటిని కూడా ఎన్సీబీ అధికారులు సోదా చేస్తున్నారు. ఈ సారి డ్రగ్స్ కేసులో ఇంకెంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు అనుమానితులుగా ఉంటారో చూడాలి.