Nedumudi Venu :మర్మ కళ.. గరుడ పురాణం…! వేణు కన్నుమూసినా గుర్తుండిపోయే పాత్రలు

కోర్టు సీన్ లో తన కూతురు, విక్రమ్ చెల్లెలు కరెంట్ షాక్ తో చనిపోయిన విషయం.. పబ్లిక్ నిర్లక్ష్యాన్ని రాము ఎందుకు ప్రశ్నిస్తాడన్న వాస్తవాన్ని నెడిముడి వేణు వివరిస్తూ...

Nedumudi Venu :మర్మ కళ.. గరుడ పురాణం…! వేణు కన్నుమూసినా గుర్తుండిపోయే పాత్రలు

Nedumudi Venu

Nedumudi Venu : ఆయన అసలు పేరు కేశవన్ వేణుగోపాల్. కానీ సినిమాల్లో నెడుముడి వేణుగానే గుర్తింపు పొందారు. ఆయన పుట్టింది కేరళ. ఎక్కువగా నటించింది మలయాళ సినిమాల్లో అయినప్పటికీ.. తమిళ సినిమాలతోనే పాపులర్ అయ్యారు. డైరెక్టర్ శంకర్ ప్యాన్ సౌత్ ఇండియా, ప్యాన్ ఇండియా సినిమాలతో.. దేశప్రజలకు బాగా పరిచయమయ్యారు. భారతీయుడు, అపరిచితుడు లాంటి ఐకానిక్, బ్లాక్ బస్టర్ సినిమాలతో… నెడుముడి వేణు అందరికంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Nedumudi Venu : ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

కొందరికి నెడిముడి వేణు అని ఆయన పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. భారతీయుడు సినిమాలో పోలీస్ అధికారి కృష్ణస్వామి, అపరిచితుడు సినిమాలో రాము(విక్రమ్) తండ్రి పార్థసారథి పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు. ఓవరాక్షన్ లేకుండా.. క్యారెక్టర్ కు తగ్గట్టు సహజంగా అద్భుతంగా నటిస్తారు కాబట్టే.. ఆయనకు 3 జాతీయ అవార్డులు, ఆరు కేరళ రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. తెలుగు వారికి నెడుముడి వేణు బాగా గుర్తుండిపోయే ఆ రెండు పాత్రలను పరిశీలిస్తే..

1.భారతీయుడు.
ఈ సినిమాలో కృష్ణస్వామి అనే పోలీస్ అధికారి పాత్ర పోషించారు. సేనాపతి ఇంటికి మారువేశంలో వచ్చి.. సంతకం తీసుకుని.. చేసిన హత్యలపై కూపీ లాగే సీన్ ఓ హైలైట్. లొంగిపోవాలంటూ రివాల్వర్ తో బెదిరించే సీన్ అప్పట్లో ఓ సెన్సేషన్. తుపాకీ పట్టుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ ను వాలు కుర్చీ కర్రతో కొట్టి.. మర్మకళ ఉపయోగించి అచేతనుడిగా మార్చేస్తాడు సేనాపతి. ఈ కృష్ణస్వామి క్యారెక్టర్.. ఈ సీన్ తోపాటు.. ఆయన మరిన్ని సన్నివేశాలు అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.

2. అపరిచితుడు.
రాము(విక్రమ్) తండ్రి పార్థసారథి పాత్రలో ఒదిగిపోయారు నెడిముడి వేణు. కోర్టు సీన్ లో తన కూతురు, విక్రమ్ చెల్లెలు కరెంట్ షాక్ తో చనిపోయిన విషయం.. పబ్లిక్ నిర్లక్ష్యాన్ని రాము ఎందుకు ప్రశ్నిస్తాడన్న వాస్తవాన్ని నెడిముడి వేణు వివరిస్తూ… అలా జనం గుండెల్లో స్టాంప్ వేసేశారు. పోలీస్ ఆఫీసర్ ప్రకాశ్ రాజ్.. వివేక్ తో కలిసి రామం వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు గరుడ పురాణం తీసుకొచ్చేది కూడా ఈయనే. ఈ పాత్రకు తనికెళ్ల భరణి డబ్బింగ్ అచ్చుగుద్దినట్టు సరిపోయింది.

Madhumitha : హేమ తన భర్త చేయి కొరకడం గురించి మధుమిత ఏమందంటే

నెడుముడి వేణు(73) ఈ ఉదయం కన్నుమూశారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఐతే.. కోవిడ్ తర్వాత సమస్యలతో ఇబ్బందిపడుతూ కన్నుమూశారు. వేణుకి భార్య టి.ఆర్.సుశీల, ఉన్ని, కణ్ణన్ అనే ఇద్దరు కుమారులున్నారు. 500లకు పైగా సినిమాల్లో నటించారాయన. మలయాళంతో పాటు తమిళ్‌లోనూ యాక్ట్ చేశారు. పోషించేది ఎలాంటి పాత్ర అయిన అందులోకి పరకాయ ప్రవేశం చేసి, తన నటనతో ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత.