Aha : ప్రేక్ష‌కుల ఆద‌రణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘నీడ‌’, ‘హీరో’ చిత్రాల‌తో ఈ వీకెండ్ ‘ఆహా’ సంద‌డి..

‘ఆహా’ లో జూలై 23న ‘నీడ’, జూలై 24న ‘హీరో’ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి..

10TV Telugu News

Aha: హండ్రెడ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ప్ర‌తి వారాంతం ప్రేక్ష‌కుల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘నీడ‌’, ‘హీరో’ చిత్రాలు రెండు ‘ఆహా’ లో విడుద‌ల‌వుతున్నాయి. ‘నీడ’ సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. న‌య‌న‌తార‌, కూన్‌చ‌కొ బొబ్బ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించారు. అప్పు ఎన్‌.భ‌ట్టాతిరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జూలై 23న ఈ చిత్రం ‘ఆహా’ లో విడుద‌ల‌వుతుంది. రిషబ్ శెట్టి హీరోగా న‌టిస్తూ నిర్మించిన ‘హీరో’ చిత్రం జూలై 24న ‘ఆహా’ లో విడుద‌ల‌వుతుంది. గ‌న‌వి ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌మోద్ శెట్టి, ఉగ్రం మంజు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ఎం.భ‌ర‌త్ రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..

గొళ్లు కొరుక్కునేంత ఎగ్జ‌ైట్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు క‌లిగించేలా రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘నీడ‌’. ఓ మ‌హాన‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. నితిన్ అనే స్కూలుకు వెళ్లే పిల్లాడి కోణంలో ఈ సినిమా క‌థ‌ వివ‌రించారు. తన చుట్టూ జ‌రిగిన ప‌లు హ‌త్య‌ల‌ను అత‌ను వివ‌రిస్తాడు. మేజిస్ట్రేట్ జాన్ బేబీతో స‌హా అంద‌రినీ ఆ క‌థ‌నాలు అబ్బుర‌ ప‌రుస్తాయి. అయితే జాన్‌కు ఈ క‌థ‌ల మధ్య ఉన్న లింకులు ప‌ట్టుకోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం పట్ట‌దు. ఈకేసును చేధించ‌డానికి అత‌ను ఎలా ముందుకెళ‌తాడు? అనేదే సినిమా. ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రోల‌ర్ కోస్ట‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించారు.

‘హీరో’ సినిమా విష‌యానికి వ‌స్తే యాక్ష‌న్‌, కామెడీ అంశాల మేళ‌వింపుతో రూపొందిన చిత్ర‌మిది. ఓ క్షుర‌కుడు ఓ ప్ర‌మాద‌కారి అయిన గ్యాంగ్‌స్ట‌ర్ ఇంట్లో త‌న మాజీ ప్రేయ‌సిని క‌లుస్తాడు. వారిద్ద‌రూ ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌, అత‌ని అనుచ‌రుల‌ను ఎదిరించి ఇంటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చేసే ప‌నులు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. మ‌రి వారిని విధి ఎక్క‌డికి తీసుకెళుతుంది? అనేదే సినిమా. మంచి కామెడీతో ఈ చిత్రం మీ వారాంతాన్ని పూర్తి చేస్తుంద‌నడంలో సందేహం లేదు.

ఈ వారాంతాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుకోవాల‌ని మీరు భావిస్తే ‘ఆహా’ లో విడుద‌లైన సై ఫై క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘కుడి ఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌ను మీరు చూడాల్సిన ప్లే లిస్టులో చేర్చుకోవాల్సి ఉంటుంది. ‘యూ ట‌ర్న్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప‌వ‌న్‌ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌డం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి టైమ్ లూప్ అనే యూనిక్ పాయింట్‌తో రూపొందింది. ఇందులో అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. రీసెంట్‌గా ‘ఆహా’ లో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇంకా ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘లెవ‌న్త్ అవ‌ర్’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, ఒరిజిన‌ల్స్‌తో మిమ్మ‌ల్ని అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది ‘ఆహా’.

×