నెలవంక నీ నవ్వుకి సరిపోదు – ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’

  • Published By: sekhar ,Published On : February 1, 2020 / 12:03 PM IST
నెలవంక నీ నవ్వుకి సరిపోదు – ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’

టెలివిజన్ హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను ఇటీవల రానా దగ్గుబాటి ఆవిష్కరించారు.

pradeep

తాజాగా ఈ సినిమా నుంచి ‘నీలి నీలి ఆకాశం’ అనే వీడియో సాంగ్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ కంపోజ్ చేయగా చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఈ మధ్య తన మధురమైన గాత్రంతో అలరిస్తున్న సిధ్ శ్రీరామ్, సునీతతో కలిసి ఈ పాటను పాడారు.

pradeep

బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : దాశరథి శివేంద్ర, ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్.