Telugu Movies: ఒకరిపై ఒకరు నెగెటివ్ దుమారం.. బూమ్‌రాగ్ అవుతున్న సినిమాలు!

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైతే సూపర్ హిట్.. హిట్.. ఎబోవ్ యావరేజ్.. యావరేజ్ ఇలా ఒక స్కేల్ ఉండేది. కానీ.. ఈ మధ్య కాలంలో రెండే వినిపిస్తున్నాయి. ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు.

Telugu Movies: ఒకరిపై ఒకరు నెగెటివ్ దుమారం.. బూమ్‌రాగ్ అవుతున్న సినిమాలు!

Telugu Movies

Telugu Movies: ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైతే సూపర్ హిట్.. హిట్.. ఎబోవ్ యావరేజ్.. యావరేజ్ ఇలా ఒక స్కేల్ ఉండేది. కానీ.. ఈ మధ్య కాలంలో రెండే వినిపిస్తున్నాయి. ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు. అంతలా మూవీ టాక్ మారిపోయింది. దీనికి కారణం కూడా సోషల్ మీడియానే అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సినిమా చూసిన ఆడియన్స్ నుండి మౌత్ టాక్ ను బట్టి సినిమా రిజల్ట్ తెలిసేది. కానీ.. ఇప్పుడు సినిమా థియేటర్ లో ఫస్ట్ షో కాకముందే సోషల్ మీడియాలో సినిమా రిజల్ట్ ఇదే అంటూ పోస్టులు.. మీమ్స్.. రివ్యూలు ప్రత్యక్షమవుతున్నాయి.

Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!

సినిమా బావుంటే ఎవరు దాన్ని ఆపలేరు. కానీ.. కొంచెం తేడా కొట్టినా సోషల్ మీడియాలో ఏకిపారేసి.. దానిలో మైనస్ పాయింట్స్ అన్నీ వెతికి వెతికి మరీ తాట తీసేస్తున్నారు. ముఖ్యంగా ఒక హీరో సినిమా వస్తుందంటే.. ఆ హీరో అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. మిగతా హీరోల అభిమానులు కూడా అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ యాంటీ హీరోల ఆడియన్స్ వెతికేది.. సినిమాకు ఎలా అట్టర్ ఫ్లాప్ ముద్రవేయాలా అని మాత్రమే అన్నది ఇప్పుడు ముమ్మాటికీ స్పష్టంగా కనిపిస్తున్న అంశం.

Telugu Movies: మాస్ ఆడియెన్స్ ఆదరణ లేదా.. రాధేశ్యామ్, ఆచార్య రిజల్టే!

ఔను.. జస్ట్ సినిమాలో ఏ మాత్రం కొంచెం కాస్త మైనస్ పాయింట్ కనిపించినా యాంటీ ఫ్యాన్స్ దాన్ని చీల్చి చెండాడి సోషల్ మీడియాలో ట్రేండింగ్ హ్యాష్ ట్యాగ్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అందునా ముందుగా ఒక హీరో సినిమా ప్లాపయితే ఆ హీరో అభిమానులు తర్వాత వచ్చే సినిమాపై పగబట్టి మరీ మా హీరో సినిమా పోయింది.. ఎలాగైనా వచ్చే యాంటీ హీరో సినిమాను కూడా వదిలేది లేదని పనిగట్టుకొని మరీ బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఈ కల్చర్ ఎంత దారుణంగా మారిపోయిందో మీరే అర్ధం చేసుకోవాలి.