Neha Chowdary : బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నేహా చౌదరి పెళ్లి గోల మొదలైంది..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన 'నేహా చౌదరి' తెలుగు ఫామిలీస్ కి చాలా దగ్గరయింది. ఇక విషయానికి వస్తే గతకొన్ని రోజులుగా నేహా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా 'ఐ సేడ్ ఎస్' అంటూ నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

Neha Chowdary : బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నేహా చౌదరి పెళ్లి గోల మొదలైంది..

Neha Chowdary said yes to marriage

Neha Chowdary : బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన ‘నేహా చౌదరి’ తెలుగు ఫ్యామిలీస్ కి చాలా దగ్గరయింది. అయితే ఈ అమ్మడు అంతకుముందే సినీ, క్రీడా రంగంలో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. తిరుపతి అమ్మాయి అయిన నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు షోలకు యాంకరింగ్‌ చేస్తూ వచ్చింది.

Neha Chowdary : రేవంత్ వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. రివేంజ్ అవకాశం వస్తే వదలను..

ఇక విషయానికి వస్తే గతకొన్ని రోజులుగా నేహా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ ఎంట్రీ సమయంలో కూడా నాగార్జునతో ‘బిగ్‌బాస్‌ షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంటిలో వాళ్లకి చెప్పి వచ్చాను’ అంటూ వెల్లడించింది. దీంతో ఈ జిమ్నాస్టిక్స్ సుందరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనే వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ‘ఐ సేడ్ ఎస్’ అంటూ యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని జతచేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

యూట్యూబ్ లో నేహా.. ‘అలా నేహాతో’ అనే ఒక బ్లాగ్ రన్ చేస్తుంది. ఆ బ్లాగ్ లో ‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ ఒక వీడియో చేసి తన కాబోయే వరుడుని రెవీల్ చేసింది. ఇంజనీరింగ్ క్లాస్ మేట్ అయిన తన స్నేహితుడినే వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. దాదాపు 13 ఏళ్ళ నుంచి వీరిద్దరూ ప్రేమించుకోగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీంతో ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజెన్లు.