Pushpa Movie : ‘సామీ సామీ’ సాంగ్‌కి నేపాల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా!

నేపాల్‌లోని అల్లు అర్జున్ అభిమానులు.. థియేటర్లో ‘సామీ సామీ’ సాంగ్‌కి అరుపులు, కేకలతో డ్యాన్స్ చేశారు..

Pushpa Movie : ‘సామీ సామీ’ సాంగ్‌కి నేపాల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా!

Saami Saami Song

Pushpa Movie: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌‌ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప’.. డిసెంబర్‌17న పాన్‌ఇండియా మూవీగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో పాటు పాండమిక్ తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

అంతేకాదు, ఈ చిత్రంతో బాలీవుడ్‌లో బన్నీకి మరింత క్రేజ్‌పెరిగింది. ‘పుష్ప’ హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకు దగ్గర్లో ఉంది. ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలోనూ బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు పుష్ప రాజ్. సెకండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియా మూవీ ‘పుష్ప’ నే కావడం విశేషం.

Pushpa Movie : జడేజా, బన్నీని బాగా ప్రమోట్ చేస్తున్నాడుగా..

Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!

అల్లు అర్జున్‌కి కేరళలో మాంచి ఫాలోయింగ్ ఉందని, అక్కడ తనని మల్లు అర్జున్ అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇంతకుముందు హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్‌లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ జనాలకు కూడా పరిచయమయ్యాడు.

Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!

ఇదిలా ఉంటే బన్నీ క్రేజ్ నేపాల్‌కి పాకింది. నిజమే.. నేపాల్‌లోని అల్లు అర్జున్ అభిమానులు, థియేటర్లో ‘సామీ సామీ’ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. అరుపులు, కేకలతో రచ్చ రంబోలా చేశారు. ఈ వీడియోను రాక్‌స్టార్ డిఎస్పీ ట్విట్టర్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.