Netflix : నెట్‌ఫ్లిక్స్ సంక్రాంతి పండగ.. ఒకే రోజు 16 తెలుగు సినిమాలు అనౌన్స్..

టాప్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని రోజులుగా ఇండియాలో, రీజనల్ లాంగ్వేజెస్ లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే లోకల్ భాషల సినిమాలని వరుసగా తమ ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. తాజాగా తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి కానుకగా ఒకేరోజు 16 తెలుగు సినిమాలని...............

Netflix : నెట్‌ఫ్లిక్స్ సంక్రాంతి పండగ.. ఒకే రోజు 16 తెలుగు సినిమాలు అనౌన్స్..

Netflix announce their upcoming 16 movies at a time

Netflix :  సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయి పండగ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఇక కుటుంబాలతో కలిసి ప్రజలు సినిమాలకి కూడా వెళ్లి సంక్రాంతిని ఎంజాయ్ చేస్తారు. ఈ సారి కూడా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

ఇటీవల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక ఓటీటీలో వస్తాయన్న సంగతి తెలిసిందే. సినిమా విజయాన్ని బట్టి థియేటర్లో రిలీజయిన ఎన్ని రోజుల తర్వాత ఓటీటీ లోకి రావాలని నిర్మాతలు, ఓటీటీ నిర్వాహకులు ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని సినిమాలని రిలీజ్ కి ముందే వాటికి ఉన్న క్రేజ్ ని బట్టి, ఆ హీరోలకి ఉన్న డిమాండ్ ని బట్టి ఓటీటీ నిర్వాహకులు తీసుకుంటారు. అలాగే బడ్జెట్, ప్రమోషన్ కొంచెం కలిసొస్తుందని నిర్మాతలు కూడా ముందే కొన్ని సినిమాలని ఓటీటీ పార్ట్నర్స్ ని లాక్ చేసుకుంటారు.

టాప్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని రోజులుగా ఇండియాలో, రీజనల్ లాంగ్వేజెస్ లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే లోకల్ భాషల సినిమాలని వరుసగా తమ ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. తాజాగా తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి కానుకగా ఒకేరోజు 16 తెలుగు సినిమాలని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందులో చాలా వరకు ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాలే. ఇన్ని సినిమాలతో ముందే ఒప్పందం కుదుర్చుకొని అవి థియేటర్ లో రిలీజ్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవుతాయని ప్రకటించింది.

Tamil Stars : అయ్యప్పమాలలో శబరిమలకు బయలుదేరిన తమిళ స్టార్లు..

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన వాటిలో.. చిరంజీవి భోళాశంకర్, కళ్యాణ్ రామ్ అమిగోస్, సందీప్ కిషన్ బడ్డీ, నాని దసరా, బుట్టబొమ్మ, రవితేజ ధమాకా, కార్తికేయ 8వ సినిమా, కిరణ్ అబ్బవరం మీటర్, నిఖిల్ 18 పేజెస్, నాగశౌర్య నెక్స్ట్ సినిమా, అనుష్క నెక్స్ట్ సినిమా, పంజా వైష్ణవ తేజ్ నెక్స్ట్ సినిమా, DJ టిల్లు 2, వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి. ఒకేసారి 16 సినిమాలు అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులతో పాటు వేరే ఓటీటీ సంస్థలు కూడా ఆశ్చర్యపోతున్నారు.