Netflix : కొరియన్ కంటెంట్ పై ఏకంగా 20 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని అనేక భాషల్లో సొంత కంటెంట్ నిర్మాణం కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. తాజాగా కొరియా కంటెంట్ పై నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది.

Netflix : కొరియన్ కంటెంట్ పై ఏకంగా 20 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న నెట్‌ఫ్లిక్స్

Netflix invest 2.5 billion dollars in South Korea

Netflix :  ఓటీటీలు(OTT) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూలింగ్ చేస్తున్నాయి. కరోనా పుణ్యమా అని ఓటీటీకి మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో అన్ని పెద్ద ఓటీటీ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టి సొంత కంటెంట్ ను కూడా తయారుచేస్తూ ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. వరల్డ్ టాప్ ఓటీటీల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ కు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. అత్యధిక వ్యూయర్స్ కూడా ఉన్నారు. వరల్డ్ టాప్ వెబ్ సిరీస్(Web Series)లలో సగం పైన నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓటీటీలోనే ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని అనేక భాషల్లో సొంత కంటెంట్ నిర్మాణం కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. తాజాగా కొరియా కంటెంట్ పై నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. కొరియా నుంచి వచ్చే సినిమాలు, సిరీస్ లు ఇటీవల ప్రపంచ ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. మన ఇండియాలో కూడా కొరియన్ కంటెంట్ కి చాలా మంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే పలు ఇండియన్ నిర్మాణ సంస్థలు కొరియన్ సినిమాల రైట్స్ తీసుకొని ఇక్కడ డబ్బింగ్ చేయడం, రీమేక్స్ చేయడం చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం కొరియా నుంచి వచ్చిన స్క్విడ్ గేమ్స్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజయి ప్రపంచమంతటా భారీ విజయం సాధించింది. దాదాపు 10 రెట్ల ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఇటీవల కొరియన్ కంటెంట్ కు మంచి ఆదరణ లభిస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్ కొరియన్ కంటెంట్ పై 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దీంతో త్వరలో మరింత ఆసక్తికరమైన కొరియన్ కంటెంట్స్ నెట్‌ఫ్లిక్స్ లో రానున్నాయి.

James Gunn : ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉంది.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

సౌత్ కొరియా ప్రసిడెంట్ Yoon Suk Yeol అమెరికా పర్యటనలో భాగంగా నెట్ ఫ్లిక్స్ మేనేజ్మెంట్ ని కలిశారు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ co-CEO Ted Sarandos ఈ ఒప్పందం చేసుకున్నారు.