Netflix: 100 రోజుల వ్యవధిలో 2లక్షల చందాదారులను కోల్పోయిన నెట్‌ప్లిక్స్.. సరికొత్త ఆఫర్లతో తిరిగి పొందేలా ప్లాన్?

కోల్పోయిన చందాదారులను తిరిగి పొందేందుకు నెట్‌ప్లిక్స్ సరికొత్త ఆపర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ 100 రోజుల్లో 2,00,000 మంది సబ్‌ స్క్రైబర్‌లను...

Netflix: 100 రోజుల వ్యవధిలో 2లక్షల చందాదారులను కోల్పోయిన నెట్‌ప్లిక్స్.. సరికొత్త ఆఫర్లతో తిరిగి పొందేలా ప్లాన్?

Netflix

Netflix: కోల్పోయిన చందాదారులను తిరిగి పొందేందుకు నెట్‌ప్లిక్స్ సరికొత్త ఆపర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ 100 రోజుల్లో 2,00,000 మంది సబ్‌ స్క్రైబర్‌లను కోల్పోయిందని, గత దశాబ్దపు కాలం సేవలో్ల ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం ఎదుర్కొన్న అతిపెద్ద నష్టం ఇదేనని సంస్థ పేర్కొంది. ద్రవ్వోల్బణం, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధంతొ చందాదారులను నెట్ ప్లిక్స్ భారీగా కోల్పోయింది. దీంతో కోల్పోయిన వినియోగదారులను తిరిగి వెనక్కు తీసుకురావడానికి ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ నెట్ ప్లిక్స్ చౌకైన ప్లాన్ లను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Netflix: ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేర్ చేసుకోవచ్చట!!

ఇదిలా ఉంటే రష్యాలో నెట్ ప్లిక్స్ సేవలను నిలిపివేసిన విషయం విధితమే. దీంతో దాదాపు 7లక్షల మంది సభ్యులను నష్టపోవాల్సి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ మొదటి త్రైమాసికంలో 2.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాని అంచనా కంటే చాలా తక్కువగా ఉంది. అంతేకాక స్ట్రేంజర్ థింగ్స్, బెటర్ కాల్ సాల్, ఓజార్క్ ది వంటి పెద్ద బ్యానర్ సినిమాలు విడుదలైనప్పటికీ ఏప్రిల్-జూన్ కాలంలో సబ్‌స్క్రైబర్‌లను నష్టపోనున్నట్లు సంస్థ అంచనా వేసింది. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ నెలల్లో లాక్‌డౌన్‌ల కారణంగా చాలా మంది ప్రజలు ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు నెట్‌ఫ్లిక్స్ భారీ వృద్ధిని సాధించింది. అయితే అదే కంపెనీ షేరు మంగళవారం 26శాతం పతనమై దాదాపు $40 బిలియన్లు, స్టాక్ మార్కెట్ విలువలో దాదాపు సగం విలువను తొలగించింది.

Netflix : నెట్‌ఫ్లిక్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఛాన్స్

అయితే ఇటీవలి కాలంలో పోయిన సబ్ స్క్రైబర్స్ ను, కొత్తవారిని రాబట్టుకొనే నెట్ ప్లిక్స్ సరసమైన ప్లాన్ లపై ఏడాది, రెండేళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈవో రీడ్ హెస్టింగ్స్ తెలిపారు. తమ ఇంటి వెలుపల స్నేహితులు, కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకునే కస్టమర్ల నుండి అదనపు ఆదాయాన్ని పొందేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో మాత్రమే 30 మిలియన్లతో సహా భాగస్వామ్య ఖాతాల ద్వారా నెట్‌ఫ్లిక్స్ చూస్తున్న 100 మిలియన్ల కుటుంబాల నుండి ఆదాయాన్ని పొందే మార్గాలను నెట్ ప్లిక్స్ అన్వేషిస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం ఇప్పటికే తన ప్లాట్‌ఫారమ్‌ను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది, ప్రాంతీయ కంటెంట్‌పై దృష్టి సారించింది.