Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్.. ఈ సారి అంతకు మించి.. తమన్నా, మృణాల్, కాజోల్ తో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

తాజాగా నేడు సడెన్‌గా లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లోనే బోల్డ్ డైలాగ్స్ తో ఈ సీక్వెల్ పై హైప్ పెంచేశారు.

Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్.. ఈ సారి అంతకు మించి.. తమన్నా, మృణాల్, కాజోల్ తో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

Netflix Lust Stories 2 Teaser Released starring Mrunal Thakur Tamannaah Kajol Vijay Varma

Netflix Lust Stories 2 : 2018లో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన బాలీవుడ్(Bollywood) ఫిలిం లస్ట్ స్టోరీస్. నాలుగు సిగ్మెంట్స్ తో తెరకెక్కిన ఈ ఫిలిం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ తో ప్రమోట్ అయి విమర్శలు తెచ్చుకున్నా ఈ ఫిలిం బాగా సక్సెస్ అయింది. లస్ట్ స్టోరీస్(Lust Stories) లో కియారా అద్వానీ(Kiara Advani), భూమి పెడ్నేకర్(Bhumi Pednekar), రాధికా ఆప్టే(Radhika Apte), మనిషా కొయిరాలా, విక్కీ కౌశల్, రణదీప్ ఝా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కించారు. నాలుగు సిగ్మెంట్స్ ని నలుగురు బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కరణ్ జోహార్(Karan Johar), అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), జోయా అక్తర్(Joya Akthar), దిబాకర్ బెనర్జీ తెరకెక్కించారు.

గతంలోనే లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఎప్పుడు, ఎవరు అని చెప్పలేదు నెట్‌ఫ్లిక్స్. తాజాగా నేడు సడెన్‌గా లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఫిలింలో నటించిన వాళ్ళను చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ,అమృత సుభాష్, అంగద్ బేడీ.. లాంటి స్టార్స్ అంతా నటిస్తున్నారు. తమన్నా, మృణాల్, కాజోల్ ని ఇలాంటి సిరీస్ లో చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Parasuram : ఆరు కోట్లకు ఏడు కోట్లు వడ్డీ కట్టిన డైరెక్టర్.. సినిమా చేయకుండా జంప్ అయినందుకు భారీ నష్టం..

తాజాగా రిలీజ్ అయిన టీజర్ లోనే బోల్డ్ డైలాగ్స్ తో ఈ సీక్వెల్ పై హైప్ పెంచేశారు. లస్ట్ స్టోరీస్ చాలా బోల్డ్ అనుకుంటే ఈ సారి దానికి మించి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అందులోనూ ఈ సారి స్టార్ క్యాస్టింగ్, బాగా పాపులర్ వాళ్ళు, అస్సలు ఊహించని వాళ్ళు ఇలాంటి సిరీస్ లో ఉండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ లస్ట్ స్టోరీస్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి కూడా నాలుగు సిగ్మెంట్స్ తో నలుగురు డైరెక్టర్స్ లస్ట్ స్టోరీస్ 2ని తెరకెక్కిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు లస్ట్ స్టోరీస్ 2ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్ జూన్ 29 నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.