Netflix : RRR సినిమా మాకు ఉపయోగపడింది.. కానీ.. ఇండియన్ సినిమాలపై నెట్ ఫ్లిక్స్ కామెంట్స్..

టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఇప్పుడు కొత్త సహ-CEOలుగా ఉన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి కూడా మాట్లాడారు. 'నెట్‌ఫ్లిక్స్ ని పైకి తీసుకురావడానికి.............

Netflix : RRR సినిమా మాకు ఉపయోగపడింది.. కానీ.. ఇండియన్ సినిమాలపై నెట్ ఫ్లిక్స్ కామెంట్స్..

Netflix new Co-Ceo's comments on Indian Cinema

Netflix :  వరల్డ్ టాప్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని రోజులుగా లోకల్ మార్కెట్ మీద దృష్టి పెడుతుంది. కేవలం హాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలని మాత్రమే కాక అన్ని దేశాల్లో లోకల్ లాంగ్వేజ్ సినిమాలని కూడా కొంటుంది. అంతేకాక లోకల్ గా సినిమాలు, సిరీస్ లు కూడా నిర్మిస్తుంది. ఇప్పటికే ఇండియాలో, ముఖ్యంగా సౌత్ లో నెట్‌ఫ్లిక్స్ పాగా వేయాలని గట్టిగా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే సంక్రాంతికి తెలుగులో 16 సినిమాలని, తమిళ్ లో 18 సినిమాలని కొంటున్నట్టు, అవి థియేట్రికల్ రిలీజ్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లోనే వస్తాయని ప్రకటించింది. ఇక సొంతంగా కొన్ని సిరీస్ లు కూడా నిర్మిస్తుంది నెట్‌ఫ్లిక్స్.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

తాజాగా నెట్‌ఫ్లిక్స్ కి కొత్త నాయకులు వచ్చారు. టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఇప్పుడు కొత్త సహ-CEOలుగా ఉన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి కూడా మాట్లాడారు. ‘నెట్‌ఫ్లిక్స్ ని పైకి తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నిస్తాం. కానీ దానికి కొంత టైం పడుతుంది. భారతదేశంలో మంచి సినిమా సంస్కృతి ఉంది. కానీ అమెరికాలో భారతీయ సినిమాల గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మేము భారత్ లో వృద్ధి రేటు సాధిస్తున్నాం. కొరియాలో, జపాన్ లో మాకు ఆదరణ వచ్చినట్టే ఇండియాలో కూడా వస్తుంది. ఇండియాలో మా మార్కెట్ ని విస్తృతం చేస్తున్నాం. ఇటీవల RRR సినిమా మాకు చాలా ఉపయోగపడింది. విదేశాల్లో కూడా RRR సినిమా నెట్‌ఫ్లిక్స్ కి ఎంతో ఉపయోగపడింది. కానీ అది థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో వచ్చింది. మేము సొంత సినిమాలు, సిరీస్ లపై కూడా దృష్టి పెడుతున్నాం. వీటివల్ల మాకు ఇంకా విజయం చేకూరుతుంది అని తెలిపారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా సినిమా మీద బాగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.