‘ప్రభాస్.. అమితాబ్ కంటే పెద్ద స్టార్’.. వైరల్ అవుతున్న నెటిజన్ కామెంట్

  • Published By: sekhar ,Published On : October 10, 2020 / 01:09 PM IST
‘ప్రభాస్.. అమితాబ్ కంటే పెద్ద స్టార్’.. వైరల్ అవుతున్న నెటిజన్ కామెంట్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ కలయికలో అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తోంది. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్‌ మూవీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.


అమితాబ్ చేరికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ వచ్చింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్, అమితాబ్ అలాగే మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.


‘క్షమించండి సార్.. కానీ ప్రభాస్ మీరు మాకు అమితాబ్ కంటే పెద్ద స్టార్’ అంటూ Ziangchettriu అనే వ్యక్తి కామెంట్ చేశాడు. తను ఇలా అంటున్నందుకు ఆ వ్యక్తి అమితాబ్‌కు సారీ చెప్పడం విశేషం. ప్రభాస్ పై అభిమానంతో ఈ నెటిజన్ చేసిన కామెంట్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటోంది.Prabhas

‘ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’.. అని బిగ్‌బి కామెంట్ చేశారు. అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల అమితాబ్ బచ్చన్ సార్‌తో తెరపంచుకోబోతున్నాను.. కల నిజమైంది అంటూ డార్లింగ్ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.