Rashmika Mandanna: నెటిజన్ షాకింగ్ కామెంట్.. రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!

న్నడ భామ రష్మిక మందనా ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా వాంటింగ్ హీరోయిన్. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మికనే సౌత్ క్వీన్. ఈ విషయాన్ని స్వయంగా ఫోర్బ్స్ డిక్లేర్ చేసింది.

Rashmika Mandanna: నెటిజన్ షాకింగ్ కామెంట్.. రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!

Rashmika Mandanna

Rashmika Mandanna: కన్నడ భామ రష్మిక మందనా ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా వాంటింగ్ హీరోయిన్. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మికనే సౌత్ క్వీన్. ఈ విషయాన్ని స్వయంగా ఫోర్బ్స్ డిక్లేర్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్ తో పాటు నెటిజన్లతో ముచ్చట్లు పెడుతూ అభిమాన గణాన్ని పెంచుకుంటూపోతుంది రష్మిక. అయితే.. అప్పుడప్పుడు నెటిజన్ల నుండి ఊహించని ప్రశ్నలతో పాటు అభ్యంతరకర, అసభ్యకరమైన కామెంట్లు కూడా వస్తుంటాయి.

Forbes: సోషల్ మీడియా క్వీన్ రష్మిక.. రౌడీ హీరోను దాటేసింది!

తాజాగా రష్మికకు కూడా ఓ నెటిజన్ నుండి అవమానకరమైన కామెంట్ వచ్చింది. దీనికి రష్మిక కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ర‌ష్మిక న‌టిస్తున్న‌ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగా.. ఇందులో రష్మిక నవ్వుతూ, శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపించారు. అయితే ఈ పోస్టర్‌ పైన ఓ నెటిజన్‌ రష్మికను ట్రోల్‌ చేస్తూ.. ‘ఎలా తీసుకుంటున్నార్రా దీన్ని’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపైన రష్మిక స్పందిస్తూ.. ‘నా నటన కొసం’ అంటూ అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

Rashmika Mandanna: వరసపెట్టి ఆస్తులు కొనేస్తున్న భామ.. ఎక్కడో తెలుసా?

బుద్ధిలేని ఆ నెటిజన్ కామెంట్స్ కు రష్మిక నవ్వుతూనే స్పాంటినిటీతో స్పందించిన తీరుపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక రష్మిక తెలుగు సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్పతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు చేస్తుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతుంది.