Salman Khan: సల్మాన్ డ్యాన్స్ స్టెప్‌పై వైరలవుతోన్న నెటిజన్స్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్ నయా లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Salman Khan: సల్మాన్ డ్యాన్స్ స్టెప్‌పై వైరలవుతోన్న నెటిజన్స్ కామెంట్స్

Netizens Comments Goes Viral On Salman Khan Dance In Naiyo Lagda Song

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్ నయా లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Shahrukh Khan – Salman Khan : షారుఖ్ అయిపోయింది.. నెక్స్ట్ సల్మాన్..?

కాగా, తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాలోని ఓ సాంగ్‌లో సల్మాన్ వేసిన డ్యాన్స్ స్టెప్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగానే సల్మాన్ ఖాన్ సినిమాల్లో హెవీ డ్యాన్స్ మూమెంట్స్ కనిపించవు. ఇక ఈ హీరో చేసే డ్యాన్స్ స్టెప్స్‌లో కొన్ని మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ, తాజాగా రిలీజ్ అయిన ‘నయ్యో లగ్దా’ సాంగ్‌లో సల్మాన్ చేసిన డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో సల్మాన్ ఖాన్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఏమాత్రం బాగోలేవని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఇక నెటిజన్లు ఈ డ్యాన్స్ స్టెప్పులపై తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. పిల్లలకు పీఈటీ చెప్పినట్లుగా ఆ స్టెప్పులు ఏమిటని కొందరు అంటుంటే, సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి డ్యాన్స్ కంపోజ్ చేసే వారిని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదేమైనా సల్మాన్ డ్యాన్స్ మరోసారి ట్రోలింగ్‌కు కారణం కావడంతో, ఇకనైనా ఆయన మంచి స్టెప్పులు వేస్తూ చూడాలని ఉందంటున్నారు పలువురు అభిమానులు.