Aamir Khan : మాజీ భార్యతో కలిసి పూజలు.. అమీర్‌ఖాన్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

తాజాగా అమీర్‌ఖాన్ తన ఆఫీస్ లో హిందూ సంప్రదాయంలో తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పూజలు చేశాడు. ఈ ఫోటోలు బయటకి రావడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు..........

Aamir Khan : మాజీ భార్యతో కలిసి పూజలు.. అమీర్‌ఖాన్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కి గత కొన్నేళ్లుగా విజయాలు లేవు. చాలా గ్యాప్ తీసుకొని వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఇటీవలే అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ నిశ్చితార్థం కూడా జరగగా ఇందులో సందడి చేశాడు. అమీర్‌ఖాన్ ని నెటిజన్లు చాలా సార్లు ట్రోల్ చేశారు. అమీర్‌ఖాన్ వ్యాఖ్యలు, చేతలు ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇస్తుంది. తాజాగా మరోసారి అమీర్‌ఖాన్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

గతంలో అమీర్‌ఖాన్ ఇండియా గురించి, మతాల గురించి, కొంతమందికి ఇక్కడ రక్షణ లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో దేశవ్యాప్తంగా అమీర్‌ఖాన్ పై నిరసనలు వచ్చాయి. అయితే తాజాగా అమీర్‌ఖాన్ తన ఆఫీస్ లో హిందూ సంప్రదాయంలో తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పూజలు చేశాడు. ఈ ఫోటోలు బయటకి రావడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Radhika Pandit : నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు.. KGF స్టార్ యష్ భార్య ఎమోషనల్ పోస్ట్..

ఈ ఫొటోలో అమీర్‌ఖాన్ బొట్టు పెట్టుకొని, కండువా వేసుకొని, చేతికి కంకణం కట్టుకొని, కలశం పట్టుకొని ఉన్నాడు. ఒకప్పుడు భారత సాంప్రదాయాలకు, హిందువులకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అమీర్‌ఖాన్ ఇప్పుడు ఇలా హిందువులాగా పూజ చేయడంతో, అది కూడా మాజీ భార్యతో కలిసి పూజ చేయడంతో నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. సడెన్ గా హిందూ సంప్రదాయాలని గౌరవిస్తున్నావేంటి?, నువ్వు ఎన్ని నాటకాలు వేసినా నీ సినిమాలు ఆడవు, కొత్తగా ఈ వేషం ఏంటి, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా అంటూ అమీర్‌ఖాన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి అమీర్‌ఖాన్ సడెన్ గా హిందువులాగా మారి తన ఆఫీస్ లో పూజ ఎందుకు చేశాడో ఎవరికీ తెలీదు.