Social Media Trolls: నచ్చితే ఆకాశానికే.. నచ్చకపోతే బూతులే!

అమ్మో ఈ ఫాన్స్ తో యమా డేంజర్. ఎప్పుడెలా ఉంటారో, ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో గెస్ చెయ్యడం మహా కష్టం. ఇష్టమైనప్పుడు..

Social Media Trolls: నచ్చితే ఆకాశానికే.. నచ్చకపోతే బూతులే!

Social Media Trolls

Social Media Trolls: అమ్మో ఈ ఫాన్స్ తో యమా డేంజర్. ఎప్పుడెలా ఉంటారో, ఎప్పుడెలా బిహేవ్ చేస్తారో గెస్ చెయ్యడం మహా కష్టం. ఇష్టమైనప్పుడు ఆకాశానికెత్తేస్తారు.. నచ్చకపోతే నెగెటివ్ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తారు. అది షారూఖ్ అయినా సరే.. సమంత అయినా సరే.. స్టార్ హీరోలు.. యంగ్ హీరోయిన్లన్నతేడా ఉండదు.. ఇష్టంలేని పని చేస్తే.. సోషల్ మీడియాలో నోరు పారేసుకుంటూనే ఉంటారు. ఇలా లేటెస్ట్ గా ఫాన్స్ తో తిట్లు తింటున్న స్టార్ సెలబ్రిటీలెవరో చూద్దాం.

Trolls On Actress: ట్రోల్ అవుతున్న హీరోయిన్స్.. నెటిజన్స్ ఎటాక్!

సెలబ్రిటీస్ అన్నాక ఎప్పుడూ న్యూస్ లో, సోషల్ మీడియాలో నానుతూనే ఉంటారు. ఫోటోలతోనో, సినిమాల ప్రమోషన్ విషయంలోనో ఏదోక రకంగా ఫాన్స్ తో టచ్ లోనే ఉంటారు. అయితే కొంతమంది ఫాన్స్ మాత్రం స్టార్స్ చేసిన పని నచ్చకపోతే అదే సోషల్ మీడియాలో వాళ్లని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటారు. లేటెస్ట్ గా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఫాన్స్ తో క్యూ అండ్ ఎ సెషన్ చేశారు. అయితే ఇప్పటికే 5 ఏళ్లనుంచి షారూఖ్ సినిమా రాకపోవడంతో ఈ సంవత్సరం అయినా రిలీజ్ ఉంటుందే మో అని వెయిట్ చేసిన ఫాన్స్.. నెక్ట్స్ ఇయర్ వరకూ ఆగాల్సి రావడంతో ఇరిటేట్ అయ్యి.. వార్తల్లో ఉండడం కాదు సినిమాల్లోకి రా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Actress Promotions: డబ్బిస్తే చాలు.. ఏ ప్రొడక్ట్‌కైనా మేము సిద్దమే!

బాలీవుడ్ హిట్ మెషీన్ అక్షయ్ కుమార్ ని కూడా ఫాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బచ్చన్ పాండే మూవీకి సంబందించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాండే పేరు పెట్టుకున్న అక్షయ్ కుమార్ విపరీతమైన వయెలెన్స్ స్క్రీన్ మీద చూపించడంతో.. పాండే వర్గం.. బాయ్ కాట్ బచ్చన్ పాండే అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. అంతేకాదు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సీన్స్ ఉన్నాయని.. దాంతో సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మొన్నటి వరకూ ఫాస్ట్ గా సినిమాలు చేస్తాడని, సో సింపుల్ అని, దేశానికి కష్టమొస్తే ముందుటాడని పొగిడిన ఫాన్స్.. ఇప్పుడు తెగతిట్టిపోస్తున్నారు.

Samantha: నా కుటుంబం విచ్ఛిన్నమైంది.. సామ్ మనసులో ఇంత బాధ ఉందా?

ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కశ్మీర్ ఫైల్స్ ఓ పక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతూ.. వరస పెట్టి రోజురోజుకూ ధియేటర్లు పెంచుకుంటూ పోతుంటే.. మరోపక్క ఈ సినిమాని అంతే స్ట్రాంగ్ గా ట్రోల్ చేస్తున్నారు. మీ టీర్పీల కోసం జరగని వాటిని జరిగాయని చూపించి డిస్కషన్స్ పెట్టకండి అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు కొంత మంది ఫాన్స్. అంతేకాదు.. కశ్మీర్ ఫైల్స్ కి సంబందించి కపిల్ శర్మ షోలో ప్రమోషన్ చెయ్యనివ్వలేదని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అఫీషియల్ గా పెట్టిన ట్వీట్.. సైలెంట్ గా వైరల్ అయ్యి కపిల్ చాలా కమర్షియల్ అన్న కాంట్రవర్సీకి దారితీసింది. దీంతో మొన్నటి వరకూ ఫన్ జనరేట్ చేస్తూ.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న కపిల్ ని సడెన్ గా విలన్ ని చేస్తూ.. నెటిజన్స్ ఓరేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Avoid Social Media : కన్న కొడుక్కి తల్లి ఛాలెంజ్.. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరం, తర్వాత

బాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ అనన్య పాండేని కూడా ఫాన్స్ తెగతిడుతున్నారు. నిన్నటి వరకూ ఎంత క్యూట్ గా ఉందో, ఎంత ఫిట్ గా ఉందో.. ఎంత బాగా యాక్ట్ చేస్తుందో.. ఎంత ముద్దుగా ఉందో తెగ మెచ్చుకున్న ఫాన్స్.. అసలు డ్రెస్ సెన్స్ ఉండక్కర్లేదా.. పబ్లిక్ లోకి అలాంటి బట్టలువేసుకొస్తారా.. ఇంట్లో పెద్ద వాళ్లైనా చెప్పక్కర్లేదా అంటూ ఓ పెద్ద లెక్చర్లే పీకుతున్నారు. లేటెస్ట్ గా అపూర్వ మెహతా బర్త్ డే సందర్బంగా బాలీవుడ్ అరేంజ్ చేసిన పార్టీకి.. అనన్య పాండే వేస్కొచ్చిన డ్రెస్.. చాలా ఛండాలంగా ఉందంటూ ఫాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Social Media : ఇన్‌స్టా ఫ్రెండ్ కోసం..! పేరెంట్స్‌కు చెప్పకుండా స్వీడన్ నుంచి ముంబైకి వచ్చిన 16ఏళ్ల బాలిక

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతని కూడా వదల్లేదు ఫాన్స్. విడాకులు తీసుకున్నా ఒంటరిగానే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేస్తోంది, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు చేస్తోందని నిన్నటి వరకూ పొగిడిన ఫాన్స్.. మెచ్చుకున్న ఫాన్స్ ఇప్పుడు అసలు బుద్దుందా..? పెళ్ళైన వాళ్లు చెయ్యాల్సిన పనులేనా..? డబ్బుకోసం ఏమైనా చేస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. బ్లెండర్స్ ప్రైడ్ కోసం సమంత లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బ్రౌన్ టాప్ లో సమంత బోల్డ్ గా చేసిన ఈ షూట్ లో సమంత డ్రెస్సింగ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫాన్స్.