John Abraham : మరోసారి నోరు పారేసుకున్న జాన్ అబ్రహం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. | netizens trolls on john abraham again

John Abraham : మరోసారి నోరు పారేసుకున్న జాన్ అబ్రహం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ప్రస్తుతం ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు జాన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్ మాట్లాడుతూ.. ''నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోని. వెండితెరపైనే నా సినిమాలు ఆడాలనుకుంటాను. అక్కడే.....................

John Abraham : మరోసారి నోరు పారేసుకున్న జాన్ అబ్రహం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

John Abraham :  ఇటీవల సౌత్ సినిమా సక్సెస్ బాలీవుడ్ లో కూడా చూపిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ సక్సెస్ ని చూసి కొంతమంది బాలీవుడ్ వాళ్ళు ఇక్కడి సినిమాల్లో భాగం అవుతుంటే మరి కొంతమంది మాత్రం కుళ్ళుకుంటున్నారు. సౌత్ సక్సెస్ ని తట్టుకోలేని కొంతమంది బాలీవుడ్ వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అందులో ముందు వరసలో హీరో జాన్ అబ్రహం ఉంటాడు. ఇటీవలే ఎటాక్ సినిమాతో వచ్చిన జాన్ అబ్రహం ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. త్వరలో ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ తో రాబోతున్నాడు.

గతంలో ఎటాక్ సినిమా ప్రమోషన్స్ టైంలో జాన్ అబ్రహం సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ నేను అక్కడి సినిమాల్లో నటించను, నేను హిందీ స్టార్, బాలీవుడ్ స్టార్ ని అని అన్నాడు ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలతో సౌత్ నెటిజన్లు జాన్ అబ్రహంని వీర లెవల్లో ట్రోల్ చేశారు. ఇక ఎటాక్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరింత ట్రోల్ చేశారు. తాజాగా మరోసారి ట్రోల్ చేసే విధంగా వ్యాఖ్యలు చేసాడు జాన్ అబ్రహం.

Tharun Bhaskar : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా.. సరికొత్త పేరుతో..

ప్రస్తుతం ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు జాన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్ మాట్లాడుతూ.. ”నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోని. వెండితెరపైనే నా సినిమాలు ఆడాలనుకుంటాను. అక్కడే నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా నన్ను థియేటర్ లోనే చూసుకోవాలని అనుకుంటున్నాను. నెలకి 200, 400కి ఓటీటీలో అందరికి అందుబాటులో ఉండటం నాకు ఇష్టం లేదు” అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

గతంలో సౌత్ నెటిజన్లు జాన్ ని ట్రోల్ చేస్తే ఈ సారి నార్త్ వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలకి ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోలే ఓటీటీ కోసం సపరేట్ గా చేస్తుంటే నువ్వేమన్న వాళ్లకన్నా గొప్పవాడివా, జనాల దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలి అని చూస్తున్నావా, నువ్వేమన్న పెద్ద స్టార్ అనుకుంటున్నావా.. అంటూ జాన్ అబ్రహాంని ట్రోల్ చేస్తున్నారు.

×