New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

టాలీవుడ్ స్క్రీన్ పై ఎప్పటికప్పుడు నయా తారలు మెరుస్తూ ఉంటారు. కొందరు తళుక్కున మెరిసి వెళ్లి పోతుంటే మరికొందరు సక్సెస్ కొట్టి బిజీ అయిపోతున్నారు. రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలోకి..

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

New Heroins

New Heroins: టాలీవుడ్ స్క్రీన్ పై ఎప్పటికప్పుడు నయా తారలు మెరుస్తూ ఉంటారు. కొందరు తళుక్కున మెరిసి వెళ్లి పోతుంటే మరికొందరు సక్సెస్ కొట్టి బిజీ అయిపోతున్నారు. రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలోకి కొందరు హీరోయిన్స్ అలా వచ్చారు. స్క్రీన్ మీద తమ ప్రజెన్స్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుని హీరోయిన్స్ ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి హీరోయిన్నే డింపుల్ హయతి. గద్దలకొండ గణేష్ లో జర్ర జర్రా అనే స్పెషల్ సాంగ్ చేసిన డింపుల్ హయతి, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా రవితేజకి సరిజోడుగా నటించి మెప్పించింది. విశాల్ తో సామాన్యుడులో చేసినప్పటికీ ఖిలాడితో గుర్తింపు తెచ్చుకుంది.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..!

తెలుగమ్మాయి మీనాక్షి చౌదరికి ఇచ్చట వాహనములు నిలుపరాదు డెబ్యూ మూవీ అయినా, ఖిలాడి సినిమాతోనే లైమ్ లైట్లోకొచ్చింది. గ్లామర్ తో పాటు పర్ పెక్షన్ కోసం తాపత్రయపడుతుంటారు కొంతమంది హీరోయిన్స్ అలాంటి వారి లిస్ట్ లో సంయుక్త మీనన్ కూడా ఉంది. టాలీవుడ్ లో భీమ్లానాయక్ తో ఎంట్రీ ఇస్తున్న సంయుక్త మీనన్ బేసిగ్గా కేరళ కుట్టి. మలయాళంలో డజనుకు పైగా సినిమాలు చేసింది. తమిళ్ లోనూ నటించింది. భీమ్లానాయక్ లో రానాకి జోడీగా నటిస్తుండగానే ధనుష్ హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది. అది పూర్తవకుండానే, లేటెస్ట్ గా మహేశ్ బాబు 28వ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

అందంతో పాటు అభినయం ఉంటేనే హీరోయిన్లు సక్సెస్ అవుతారు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చెయ్యడమే కాకుండా.. క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా తెలుసుకుని హోమ్ వర్క్ చేసి మరీ పెర్ఫామెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ అనన్య పాండే, సాయి మంజ్రేకర్, కేతిక శర్మలు టాలీవుడ్ స్క్రీన్ పై తమ మెరుపులే కాదు, స్టార్స్ గా వెలిగి పోవాలనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ లో అనన్య పాండే ఎంట్రీ ఇస్తే, అడవి శేష్ మేజర్ లో సాయి మంజ్రేకర్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ తో గనిలో ఛాన్స్ కొట్టేసింది. రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ, తర్వాత లక్ష్య , ఇప్పుడు రంగరంగ వైభవంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.