Bigg Boss 5 : విలన్స్ టీం నుంచి బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్

అన్ని వారాల కంటే ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ చాలా ఎక్కువగా సాగినట్టు అనిపించింది. గత రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ అంటూ ఇంటి సభ్యులను సూపర్‌ హీరోస్‌, సూపర్‌

Bigg Boss 5 : విలన్స్ టీం నుంచి బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్

Ani Master

Bigg Boss 5 :  అన్ని వారాల కంటే ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ చాలా ఎక్కువగా సాగినట్టు అనిపించింది. గత రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ అంటూ ఇంటి సభ్యులను సూపర్‌ హీరోస్‌, సూపర్‌ విలన్స్‌ అనే టీములుగా విడగొట్టి ఇష్టమొచ్చిన టాస్కులు ఇచ్చారు. పిచ్చి పిచ్చి టాస్కులతో ఇంట్లో అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. ఇక రెండు టీములుగా విడగొట్టడంతో పోటీలో తమ జట్టును గెలిపించుకునేందుకు హౌస్‌మేట్స్‌ అందరూ బాగా కష్టపడ్డారు. చివరిగా ‘మెరుపుశక్తి’ని దక్కించుకుని సూపర్‌ విలన్స్‌ జట్టు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. దీంతో విలన్స్‌ జట్టు సంబరాలు చేసుకుంది.

Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

ఇక కెప్టెన్సీ కోసం విలన్ జట్టులో ఉన్న కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. విలన్స్‌ జట్టు సభ్యులు వెల్‌క్రో జాకెట్‌ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాలి. బజర్‌ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలి. విసిరిన బాల్స్ నుంచి తప్పించుకొని అందరికంటే తక్కువ బాల్స్ అంటుకున్న కంటెస్టెంట్ కెప్టెన్ అవుతారు. అలా ఈ టాస్క్‌లో చివరి వరకు ఆడి యాని మాస్టర్‌ హౌస్ లో కొత్త కెప్టెన్‌ గా నిలిచింది. హౌస్ లోకి వచ్చిన దగ్గరినుంచి యాని మాస్టర్ కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వలేదు. తాజాగా కెప్టెన్ అవ్వడంతో తన చిరకాల కల నెరవేరింది అని తెలిపింది.