Bigg Boss 5 : విచిత్రమైన కెప్టెన్ టాస్క్.. గుడ్ల కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్

సన్నీ ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీద చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఇలా ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లడంతో

Bigg Boss 5 : విచిత్రమైన కెప్టెన్ టాస్క్.. గుడ్ల కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్

Biggboss

Bigg Boss 5 :  బిగ్ బాస్ సీజన్ 5 రోజూ గొడవలతోనే సాగిపోతుంది. మొన్న రెండు రోజులు నామినేషన్ల పర్వం సాగగా ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ చిత్ర విచిత్రమైన కెప్టెన్సీ టాస్కులు ఇస్తున్నాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఒక కోడి కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఇంటి సభ్యుల్లో ఎవరు ఎక్కువ గుడ్లను అందుకుని వాటిపై తమ ముఖం ఉన్న స్టిక్కర్స్‌ పెడతారో వాళ్ళు కెప్టెన్సీకి పోటీపడతారు అని తెలిపాడు బిగ్ బాస్. ఇక ఇక్కడినుంచి అందరూ సీరియస్ గా గేమ్ ఆడటానికి సిద్ధమైపోయారు. గొడవలు, కొట్టుకోవడాలతో ఈ టాస్క్ సాగింది.

Sharukh Khan : ఆర్యన్ కేసుతో ఆగిపోయిన షారుఖ్ సినిమాలు

ప్రియా ముందుగానే నేను అందరి గుడ్ల జోలికొస్తాను, దొంగతనం చేస్తాను, ఎవరేం చేసుకుంటరో చేసుకోండి అదే నా స్ట్రాటజీ అని హౌస్‌మేట్స్‌ను హెచ్చరించింది. దీంతో సన్నీ తన గుడ్లను కాపాడమంటూ కాజల్‌ సాయం కోరాడు. అయితే ఇది ఇండివిడ్యువల్‌ టాస్క్‌ కాబట్టి సన్నీ, కాజల్‌ కలిసి ఆడటం వల్ల ఈ టాస్క్‌ రద్దయ్యే అవకాశం ఉంటుందని రవి, యానీ మాస్టర్ లు మాట్లాడుకున్నారు. చెప్పినట్టే ప్రియా సన్నీ బుట్టలోని గుడ్లను దొంగతనం చేసింది. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడి ఇంకోసారి తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రియా నేనే దొంగతనం చేశాను అని క్లియర్ గా చెప్పింది. దీంతో సన్నీ సీరియస్ అయి చేతగానోళ్లలాగా ఒక మూలన కూర్చోవడం కాదు, గేమ్‌ సరిగ్గా ఆడు అని అన్నాడు. నేను దొంగతనం చేస్తా ఏం చేసుకుంటావో చేసుకో అని ప్రియా అనేసరికి సన్నీ కోపంతో అక్కడున్న కడ్డీని కొట్టాడు. దీంతో కామన్‌ సెన్స్‌ వాడంటూ రెచ్చిపోయింది ప్రియ. ప్రియా మళ్ళీ సన్నీ బుట్టని పట్టుకోవడానికి ట్రై చేయబోతే సన్నీ ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీద చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఇలా ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లడంతో ఇంటి సభ్యులు ఆపడానికి ట్రై చేశారు.

Sara Ali Khan : కోట్లు సంపాదించావు… బిచ్చగత్తెకు ఇచ్చేది పది రూపాయలేనా? ప్రముఖ నటిపై దారుణమైన ట్రోలింగ్

ఇక మానస్‌ ప్రియ దగ్గరకు వెళ్లి ఆమె ఇచ్చిన గుడ్లు తీసుకున్నాడు అంతే కాక ప్రియాంక కూడా తన గుడ్లన్నీ మానస్ కి ఇచ్చేసింది. సన్నీ, కాజల్‌ బుట్టల్లోని గుడ్లను సిరి, శ్రీరామ్‌ లేపేశారు. ఇక మొత్తంగా ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి మానస్ దగ్గర అందరికంటే ఎక్కువగా 32 గుడ్లు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు విన్ అయ్యారో, ప్రియా సన్నీల గొడవ ఏమైందో, ఇంకా ఏమేమి కెప్టెన్సీ టాస్క్ లు పెడతారో ఇవాళ్టి ఎపిసోడ్ లో చూడాలి.