2020 – బాలీవుడ్ తెరపై కొత్త ముఖాలు

2020- హిందీ చిత్ర పరిశ్రమకు భారీ సంఖ్యలో వారసులు పరిచయం కాబోతున్నారు..

  • Published By: sekhar ,Published On : February 18, 2020 / 10:16 AM IST
2020 – బాలీవుడ్ తెరపై కొత్త ముఖాలు

2020- హిందీ చిత్ర పరిశ్రమకు భారీ సంఖ్యలో వారసులు పరిచయం కాబోతున్నారు..

స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్.. ఫీల్డ్ ఏదైనా.. కొత్త నీరు రావాలి.. కొత్త వారిని ప్రొత్సహించాలి అంటుంటారు పెద్దలు.. ఈ రంగాలలో యంగ్ జెనరేషన్ తమ టాలెంట్‌తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో వారసుల హవా కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. 

తాత, తండ్రి, మనవడు.. ఇలా తరాల తరబడి వారసత్వం కొనసాగడం అనేది చూస్తూనే ఉన్నాం. ఏటా ఎందరో తారల పిల్లలు తెరకు పరిచయం అవడం జరుగుతుంది. 2020లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్, హిందీలో తొలిసారి నటించబోతున్న తారలు ఎవరో చూద్దాం.

 

khushi.kapoorr

ఖుషీ కపూర్
స్వర్గీయ శ్రీదేవి, బోనీ కపూర్‌ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ దఢక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నటిగా ఇప్పుడిప్పుడే మెళకువలు నేర్చుకుంటోంది జాన్వీ. అక్క బాటలోనే పయనించడానికి చెల్లెలు ఖుషీ కపూర్ కూడా సిద్ధమైంది. ఇంతకుముందు తనకు మోడలింగ్ అంటే ఇష్టమని చెప్పిన ఖుషీ ఇప్పుడు నటనపై ఆసక్తి పెంచుకుంది.

తనను బాలీవుడ్‌కి పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకుంటే ఆయణ్ణు బ్లైండ్‌గా ఫాలో అవుతానని, ఫస్ట్ మూవీలో తన కో-స్టార్ ఎవరనేది ఎంపికచేసే బాధ్యత తండ్రి బోనీ కపూర్‌దేనని తాజాగా వెల్లడించింది.

Shanaya Kapoor

షనయా కపూర్
సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ కూడా త్వరలో సినీరంగ ప్రవేశం చేయనుంది. నటిగా కంటే ముందు జాన్వీ కపూర్ నటిస్తున్న మహిళా పైలెట్ గుంజన్ సక్సేన బయోపిక్ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనినచేస్తోంది షనయా. ఇప్పటికే యాక్టింగ్, డ్యాన్సింగ్ వంటి విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్న షనయాకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు.

Manushi Chhillar

మానుషీ చిల్లర్
2017వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న మానుషీ చిల్లర్.. బాలీవుడ్‌లో కథానాయికగా నటించనుందని వార్తలు వచ్చాయి కానీ, సినిమా ప్రారంభోత్సవం వరకు మానుషీ తన సినీ రంగ ప్రవేశం గురించి రివీల్ చేయలేదు. ఫస్ట్ మూవీనే అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో చేస్తోంది. కింగ్ పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ మూవీతో మానుషీ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.

Keerthy Suresh

కీర్తి సురేష్
‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్.. అజయ్ దేవ్‌‌గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో కీర్తి కీలక పాత్ర పోషిస్తుంది.

Ahan Shetty

అహన్ శెట్టి
సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా తడప్ అనే సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఆర్ఎక్స్100 హిందీ రీమేక్ ఇది. తారా సుతారియా కథానాయిక. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి కథానాయికగా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

krystledsouza

క్రిస్టల్ డిసౌజా
టెలివిజన్ షోలతో పాపులర్ అయిన క్రిస్టల్ డిసౌజా బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయింది. ఫస్ట్ మూవీకే అమ్మడు సూపర్ జాక్ పాట్ కొట్టేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కిస్సింగ్ కిల్లర్ ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్‌‌లో రూపొందుతున్న ‘చెహరే’ సినిమాతో క్రిస్టల్ డిసౌజా హిందీ చిత్ర సీమకు పరిచయమవుతుంది. 

Alia Furniturewalla

అలియా ఎఫ్
పూజా బేడీ కూతురు అలియా కూడా లైన్‌లోకి వచ్చింది. సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రలు పోషించిన ‘జవానీ జానేమన్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది అలియా.

Shalini Pandey

షాలినీ పాండే
‘అర్జున్ రెడ్డి’తో పాపులర్ అయిన షాలినీ పాండే  కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది.. యంగ్ హీర్ రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ‘జయేష్‌భాయ్ జోర్దార్’లో కథానాయికగా నటిస్తోంది షాలినీ పాండే