Daksha Nagarkar : రవితేజకు లేడీ విలన్ గా మరో యువ హీరోయిన్

ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'రావ‌ణాసుర' అనే సినిమా తెరకెక్కబోతుంది. 'రావణాసుర' సినిమాలో రవితేజ లాయర్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా లేడీ విలన్.....

Daksha Nagarkar : రవితేజకు లేడీ విలన్ గా మరో యువ హీరోయిన్

Raviteja

Daksha Nagarkar :   ఇటీవల హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రలే కాక నటనకి ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేస్తున్నారు. విలన్ పాత్రలు కూడా చేయడానికి వెనుకాడట్లేదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ బాటలో మరో హీరోయిన్ చేరింది. ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘రావ‌ణాసుర’ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్బంగా జనవరి 14న పూజా కార్యక్రమం జరుపుకోనుంది.

Balakrishna : బాలయ్య అన్ స్టాపబుల్ రికార్డ్.. ఐఎండిబి టాప్ 10 షోలలో స్థానం

‘రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల వచ్చిన ‘క్రాక్’ సినిమాలో కూడా రవితేజకి లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇప్పుడు రాబోయే ఈ సినిమాలో కూడా లేడీ విలన్ క్యారెక్టర్ ఉందని సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ద‌క్ష న‌గార్క‌ర్‌ను తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండు సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. మరి ఈ సినిమా అయినా దక్షాకు కలిసొస్తుందో లేదో చూడాలి.