RRR Movie : అప్‌డేట్స్ వాయిదా..

కొత్త సినిమా అప్‌డేట్స్ వాయిదా.. త్వరలో న్యూ డేట్ అనౌన్స్‌మెంట్..

10TV Telugu News

RRR Movie: పాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినినిమాలు వరుసగా రిలీజులకు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్లే జెట్ స్పీడ్‌తో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 1, 3 తేదీల్లో రావాల్సిన అప్‌డేట్లను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్.

Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

నవంబర్ 30న ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం చెందడంతో సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న రిలీజ్ చెయ్యాలనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌ను వాయిదా వేశారు. అలాగే డిసెంబర్ 1న ‘భీమ్లా నాయక్’ నాలుగవ పాటను కూడా పోస్ట్ పోన్ చేశారు.

Sirivennela Family : సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే..

డిసెంబర్ 1న నాగార్జున ‘బంగార్రాజు’ లో నాగ చైతన్య – కృతి శెట్టిల సాంగ్, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అయితే ‘భీమ్లా నాయక్’ సాంగ్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. ‘బంగార్రాజు’, ‘రాధే శ్యామ్’ అప్‌డేట్స్ కూడా పోస్ట్ పోన్ చెయ్యనున్నారు మేకర్స్.

Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

×