OTT : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్..

ఆగస్టు నెలలో థియేటర్లలో, ఓటీటీల్లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలు..

10TV Telugu News

OTT: కరోనా మహమ్మారి వల్ల అన్నిరంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. షూటింగులు, రిలీజులు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది.. తిరిగి కోలుకుంటాం అనుకుంటుండగా సెకండ్ వేవ్ వచ్చి దెబ్బ మీద దెబ్బ తీసింది. ఎట్టకేలకు లాక్‌డౌన్ ఎత్తెయ్యడంతో మెల్లగా షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ పోస్ట్‌పోన్ అయిన తమ సినిమాలకు కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఆగస్టు నెలలో థియేటర్లలో, ఓటీటీల్లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

Shershaah
కార్గిల్ వార్‌లో చురుకుగా పాల్గొని, పరమ వీరచక్ర బిరుదు అందుకున్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.. ‘షేర్‌షా’.. విక్రమ్‌ని పాకిస్థాన్ ఆర్మీ ‘షేర్‌షా’ అని పిలిచే వారు.. అందుకే ఆయన బయోపిక్‌కి ఈ టైటిల్ పెట్టారు.. విష్ణు వర్థన్ డైరెక్షన్‌లో, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్ వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ కలిసి నిర్మించిన ‘షేర్‌షా’ ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Bhuj: The Pride Of India
అజయ్ దేవ్‌గణ్ లీడ్ రోల్‌లో వార్ డ్రామాగా తెరకెక్కిన మూవీ.. ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’.. సంజయ్ దత్, శరద్ కేల్‌కర్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్, నోరా ఫతేహి తదితరులు నటించగా.. అభిషేక్ డైరెక్ట్ చేశారు. ప్రోమోలతో అంచనాలు పెంచేసిన ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 13న డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

Bell Bottom
అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా.. ‘బెల్ బాటమ్’.. రంజిత్ తివారి డైరెక్షన్‌లో స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ రెట్రో కాన్సెప్ట్ మూవీలో అక్షయ్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించున్నారు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ మూవీ ఇదే కావడం విశేషం. ఆగస్టు 19న బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు అక్షయ్ కుమార్.

NAVARASA
నవరసాలనే ఎమోషన్స్ ఆధారంగా తెరెక్కుకుతన్న క్రేజీ వెబ్ సిరీస్.. ‘నవరస’.. ప్రకాష్ రాజ్, సూర్య, విజయ్ సేతుపతి, రేవతి, సిద్దార్థ్, పార్వతి, ప్రసన్న, గౌతమ్ మీనన్, బాబి సింహా తదితరులు నటిస్తున్నారు. ప్రియదర్శన్, వసంత్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, సర్జున్ కెఎమ్, కార్తీక్ నరేన్, అరవింద్ స్వామి, రతీంద్రన్ ఆర్. ప్రసాద్ డైరెక్ట్ చేశారు. ఆగస్టు 6 నుండి నెట్‌ఫ్లిక్‌లో ‘నవరస’ స్ట్రీమింగ్ కానుంది.

S.O.Z. Soldados or Zombies
పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ టెలివిజన్ సిరస్‌గా, థ్రిల్లర్, హారర్ కాన్సెప్ట్ మూవీస్‌ని ఇష్టపడే ఆడియన్స్ కోసం రూపొందిన సూపర్ హారర్ సిరీస్.. S.O.Z. Soldados or Zombies.. ఆగస్టు 6నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఆగస్టులో ప్రైమ్ రిలీజెస్..
EVANGELION:3.0+1.01 Thrice Upon A Time Modern Love – Season 2 (August 13 – అమెజాన్ ప్రైమ్‌)
Evan Almighty in Bruges (August 16)
The Skeleton Twins (August 17)
Annette Killer Among Us (August 20)
The Courier Pete the Cat Back to School Operetta (August 27)..

ఆగస్టులో డిస్నీ+హాట్‌స్టార్‌లో..
Rudra
Bhoot Police
Fear 1.O
The Empire
Escaype Live
Human
Those Pricey Thakur Girls
Six Suspects
Gharshana

 

10TV Telugu News