Music Directors : ఇండస్ట్రీలో కొత్త మ్యూజిక్ సరుకు.. దేవిశ్రీ, తమన్ కి పోటీగా ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్..

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు. మ్యూజిక్ డైరెక్టర్లంటే.. ఒకప్పుడు మణిశర్మ, కోటి.. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీళ్ల హవా ఇంకా నడుస్తుండగానే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు.............

Music Directors : ఇండస్ట్రీలో కొత్త మ్యూజిక్ సరుకు.. దేవిశ్రీ, తమన్ కి పోటీగా ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్..

New Music Directors entertaining in Tollywood

Music Directors :  ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు. మ్యూజిక్ డైరెక్టర్లంటే.. ఒకప్పుడు మణిశర్మ, కోటి.. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీళ్ల హవా ఇంకా నడుస్తుండగానే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు. అప్నా టైమ్ ఆయా అంటూ కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో టాప్ లేపుతున్నారు.

లేటెస్ట్ గా రవితేజ రావణాసుర సినిమాలో సాంగ్ రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజా సినిమా అంటే మాంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్ చేస్తారేమో అనుకన్నారంతా. కానీ ఇండోవెస్ట్రన్ ఫాస్ట్ బీట్ తో రావణాసుర యాంతం అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ఆడియన్స్ అంచనాలని తలకిందులు చేస్తూ పాప్ సాంగ్ తో సర్ ప్రైజ్ చేశారు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్.

రీసెంట్ గా నాని తన 30వ సినిమాకు సంబందించి సినిమా స్టార్ట్ చేశారు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్లో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కి మ్యూజిక్ ఎవరిస్తున్నారని ఆరా తీస్తే హేషమ్ అబ్దుల్ అని తెలిసింది. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ, శివనిర్వాణ కాంబినేషన్లో సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ ఖుషీకి కూడా మ్యూజిక్ ఇస్తూ ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు.

నాని తన 30వ సినిమాకే కాదు, రిలీజ్ కు రెడీగా ఉన్న తన అప్ కమింగ్ మూవీ దసరాకి కూడా అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ నే సెలక్ట్ చేసకున్నారు. హీరోలందరూ టాప్ రేంజ్ లో ఉన్న సంగీత దర్శకులనే ప్రిఫర్ చేస్తుంటే నాని మాత్రం ఆ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండే యువ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పట్టుకొస్తున్నారు. దసరా సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు సంతోష్ నారాయణన్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ BGM ఫ్రెష్ ఫీల్ ఇవ్వడంతో దసరాతో సంతోష్ కెరీర్ స్పీడప్ అవుతుందంటున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన సందీప్ కిషన్ మైఖేల్ మూవీ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ స్టార్ కాస్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన మైఖెల్ మూవీ అంచనాల్ని అందుకోకపోయినా మ్యూజిక్ తో ఆకట్టుకుంది. ఆర్ఆర్ సినిమాని బాగా డ్రైవ్ చేసింది. యాక్షన్ మూవీకి అన్ని ఎమోషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ కి ఆ ఫీల్ ఇచ్చారు యూనిక్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సి.ఎస్. మైఖెల్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన అప్లాజ్ కి మరిన్ని అవకాశాలతో బిజీ అవుతున్నారు శామ్.

విష్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ మ్యూజిక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉండబోతున్నా ఫస్ట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేది పాటలే కాబట్టి ఆ విషయంలో ఫుల్ సక్సెస్ అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ . ఇప్పటికే ధమ్కీ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ వైరల్ అయ్యాయి.

Rajini-Kamal : మరోసారి రజినీ, కమల్ తలపడనున్నారా??

రామ్ మిర్యాల.. ప్రజెంట్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మొన్న మొన్నటి వరకూ సోలో సాంగ్స్ తో, ఆల్బమ్స్ తో ఆకట్టుకున్న మిర్యాల సింగర్ గా బాగా పాపులర్ అయ్యారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ సినిమాకీ మ్యూజిక్ ఇవ్వకపోయినా గల్లీ రౌడీ, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలలో పాటలకి సంగీతం అందిచారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రామ్ మిర్యాల చేస్తున్నారు. డి.జె టిల్లులో టైటిల్ సాంగ్ కంపోజ్ చేసి పాడిన రామ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటతో సూపర్ పాపులర్ అయిన రామ్ సాంగ్స్ కంపోజింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లున్నా ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్లని రీప్లేస్ చేస్తూ కొత్త సాంగ్స్ తో టఫ్ ఫైట్ ఇస్తున్నారు. యూత్ హీరోలు కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మంచి మ్యూజిక్ ఇవ్వడంతో పాటు అందుబాటు బడ్జెట్ లో వస్తుండటంతో వీళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు.