OTT : మార్కెట్లోకి మరో కొత్త ఓటీటీ

తాజాగా సన్ షైన్ అనే ఓటిటి యాప్ లాంచింగ్‌ వేడుక హైదరాబాద్‌లోని దస్‌ పల్లా హోటల్‌లో జరిగింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్, యువ హీరో రాం కార్తీక్‌లు ముఖ్య అతిథులుగా........

OTT : మార్కెట్లోకి మరో కొత్త ఓటీటీ

Sunshine Ott

OTT :  కరోనా రాకతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనే ఉన్న ఓటీటీలు కరోనా రాకతో థియేటర్స్ మూతపడటంతో భారతదేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇంటర్నర్నేషనల్ నుంచి లోకల్ వరకు చాలా ఓటీటీలు మార్కెట్ లోకి వచ్చాయి. అవన్నీ కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక తెలుగులో ఆహా ఓటీటీ ప్రస్తుతం దూసుకుపోతుంది. ఎన్నో రకాల కొత్త కొత్త కంటెంట్స్ తో ప్రతి రోజు ప్రజలకి వినోదం అందచేస్తుంది. ఆహా తర్వాత తెలుగులో కూడా చాలా ఓటీటీలు వచ్చాయి. అయితే అవి ఆహా అంత సక్సెస్ అవ్వలేదు. తాజాగా మార్కెట్ లోకి మరో కొత్త ఓటీటీ వచ్చింది.

Priyanka Chopra : అంతర్జాతీయంగా అరుదైన రికార్డు.. తొలి భారతీయ నటిగా ప్రియాంక చోప్రా

తాజాగా సన్ షైన్ అనే ఓటిటి యాప్ లాంచింగ్‌ వేడుక హైదరాబాద్‌లోని దస్‌ పల్లా హోటల్‌లో జరిగింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్, యువ హీరో రాం కార్తీక్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఓటిటిని శివప్రసాద్ స్థాపించారు. ప్రస్తుతం సన్ షైన్ ఓటిటి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ఓటిటిలో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో త్వరలో ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తామని యాప్ నిర్వాహకులు తెలిపారు.