అల వైకుంఠపురములో – దసరా శుభాకాంక్షలు

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అల వైకుంఠపురములో’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 11:05 AM IST
అల వైకుంఠపురములో – దసరా శుభాకాంక్షలు

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అల వైకుంఠపురములో’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీ న్యూ పోస్టర్ విడుదలైంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు, ‘సామజవరగమన’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఫైట్ సీన్‌కి సంబంధించిన స్టిల్‌లో బన్నీ లుక్ బాగుంది. పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్‌ కాగా, టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : కత్తి పట్టిన కత్తిలా ఉన్నాడు..

సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ కానుంది.  కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.