Chef Mantra : సెలబ్రిటీలతో ‘చెఫ్ మంత్ర’.. ఆహాలో మరో కొత్త ప్రోగ్రాం

తాజాగా 'చెఫ్ మంత్ర' అంటూ మరో కొత్త ప్రోగ్రాంని స్టార్ట్ చేయబోతుంది ఆహా. ఈ ప్రోగ్రాంకి శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

Chef Mantra : సెలబ్రిటీలతో ‘చెఫ్ మంత్ర’.. ఆహాలో మరో కొత్త ప్రోగ్రాం

Chef Mantra

Chef Mantra :  తెలుగు ఓటిటి ఆహా కొత్త కొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, కొత్త రకం షోలతో దూసుకెళ్తుంది. ఇటీవలే ఆహా2.0 అంటూ సక్సెస్ మీట్ పెట్టి ఆహా ఓటిటిని మరింత కొత్తగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కోవలోనే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య బాబుతో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అంటూ కొత్త షో స్టార్ట్ చేశారు. ఈ షోకి విపరీతమైన స్పందన లభించింది. అలాగే ప్రదీప్ తో ‘సర్కార్’ అనే ప్రోగ్రాం ని కూడా నడిపిస్తుంది. తాజాగా ‘చెఫ్ మంత్ర’ అంటూ మరో కొత్త ప్రోగ్రాంని స్టార్ట్ చేయబోతుంది ఆహా.

Samantha : సమంతది నిజమైన ప్రేమ.. ఆమె వల్లే నేను మారాను

కొన్ని రోజుల క్రితం ‘ఆహా భోజనంబు’ అంటూ మంచు లక్ష్మి యాంకరింగ్ తో సెలబ్రిటీలతో కుకింగ్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత దీన్ని మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తుంది. కారణాలేంటి అనేవి తెలియదు. కానీ ఇప్పుడు అదే కాన్సెప్ట్ కి మరిన్ని అంశాలు జోడించి ‘చెఫ్ మంత్ర’ అంటూ సరికొత్తగా ప్లాన్ చేసింది ఆహా. ఈ ప్రోగ్రాంకి శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

Liger Movie : లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. ట్విట్టర్ లో విజయ్, దుల్కర్ ఇంట్రెస్టింగ్ చాట్

ఈ ప్రోమో చూస్తే ఇప్పటికే శ్రేయ, రెజీనా, సుహాస్ లతో షూట్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. వీళ్ళ ఎపిసోడ్స్ నుంచి తీసుకున్న కంటెంట్ తో ప్రోమోని చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ప్రోమో ట్రెండ్ లో ఉంది. అయితే ఈ ప్రోగ్రాంలో వంట చేయడానికి సపరేట్ చెఫ్ ఉంటారు. త్వరలోనే ఈ ప్రోగ్రాం ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.