Rajinikanth : రజినీకాంత్ కి ఈ పని రాదు.. అందుకే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్..

ఇటీవల రజినీకాంత్ కూతురు సౌందర్య కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేసింది. చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన కూతురు సౌందర్య ప్రారంభించిన

Rajinikanth : రజినీకాంత్ కి ఈ పని రాదు.. అందుకే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్..

hoote

Rajinikanth :  ఇటీవల రజినీకాంత్ కూతురు సౌందర్య కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేసింది. చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన కూతురు సౌందర్య ప్రారంభించిన ‘హూట్‌’ అనే సామాజిక మాధ్యమాన్ని ఆవిష్కరించారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో చింపేసిన సిరి లేఖ ఇదే.. బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం..

ఈ కార్యక్రమంలో సౌందర్య మాట్లాడుతూ .. తన తండ్రి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు కానీ తమిళంలో రాయడం సరిగా రాదని తెలిపారు. తన తండ్రి రజినీకాంత్ ఓ సందర్భంలో ముఖ్యమైన విషయాన్ని తమిళ్ లో పంపించాలి అనుకున్నారు. కానీ ఆయనకి తమిళ్ రాయడం రాక వాయిస్‌ మెసేజ్‌ ద్వారా పంపించారు. అప్పుడే ఈ వాయిస్ సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందని తెలిపారు.

RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

ఈ ‘హూట్‌’ అనే వాయిస్ సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తరహాలోనే ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు సౌందర్య. ప్రస్తుతం 15 జాతీయ భాషలు, 10 అంతర్జాతీయ భాషల్లో ఈ వాయిస్‌ హూట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మరి ఈ యాప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.