Adipurush: ప్రమోషన్ కోసం కొత్త పంథా.. సిద్దమవుతున్న స్పెషల్ సాంగ్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా దర్శకులతో ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం వరస షెడ్యూల్స్ తో షూటింగ్ లో బిజీగా ఉన్

Adipurush: ప్రమోషన్ కోసం కొత్త పంథా.. సిద్దమవుతున్న స్పెషల్ సాంగ్!

Adipurush

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా దర్శకులతో ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం వరస షెడ్యూల్స్ తో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ మధ్యనే రాధేశ్యామ్ షూటింగ్ కడప జిల్లా గండికోటలో జరగగా.. ఇందులో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. సలార్ ఈ ఏడాదే విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఆదిపురుష్ విడుదల చేస్తామని దర్శకుడు ఓంరౌత్ ఇప్పటికే ప్రకటించాడు. సరిగ్గా ఏడాది టార్గెట్ పెట్టుకున్న దర్శకుడు ఇప్పటి నుండే హైప్ పెంచేందుకు సిద్దమైనట్లు కనిపిస్తుంది. దీని కోసం ప్రమోషన్ లో సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు వినిపిస్తుంది. దీని కోసం ముందుగా సినిమాలోని మెయిన్ లీడ్ పాత్రలతో ఓ ప్రమోషనల్ సాంగ్ ను సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం ముంబైలోని ఓ స్టూడియోలో ఈ పాటకు సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నట్లు బీటౌన్ లో వినిపిస్తుంది.

ఆదిపురుష్ లో హీరోగా నటిస్తున్న ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్, విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో ఇద్దరితో ఈ ప్రమోషన్ సాంగ్ షూట్ జరగనుండగా మరో వారంలో ఈ పాట చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే ఏకంగా సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసిన దర్శకుడు ఓంరౌత్ ఈ పాటతో ప్రమోషన్ మొదలుపెట్టి వచ్చే ఏడాది మొత్తం ఈ సినిమాకు హైప్ పెంచేందుకు రకరకాల కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ పాట ఎలా ఉండనుందో చూడాలి.