CC TV Footage: ‘మా’ వివాదంలో ట్విస్ట్.. పోలీసుల చేతికి సీసీ టీవీ ఫుటేజ్‌!

మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు ప్రకాష్ రాజ్.

CC TV Footage: ‘మా’ వివాదంలో ట్విస్ట్.. పోలీసుల చేతికి  సీసీ టీవీ ఫుటేజ్‌!

Maa Elections

MAA Elections CC TV Footage: ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయని, సీసీ టీవీ ఫుటేజ్ కావాలంటూ మా ఎన్నికల ప్రధాన అభ్యర్థి ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు.

అయితే, లేటెస్ట్‌గా సీసీ టీవీ ఫుటేజ్ తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి చేరుకున్నారు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ రాజశేఖర్ రెడ్డి. మా ఎన్నికల సీసీ టీవీ ఫుటేజ్ సీజ్ చేసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి చేరుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ తీసుకునేందుకు సర్వర్ రూమ్‌లో ఉన్నారు పోలీసులు.

మా ఎన్నికల వివాదం చోటుచేసుకుని ఉన్న సమయంలో, ప్రకాష్ రాజ్ ఇప్పటికే మాపై దాడి జరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన సంధర్భంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ఓట్ల లెక్కింపు మొత్తం సీసీ టీవీ ఫుటేజ్‌ల్లో ఉందని, సీసీ టీవీ ఫుటేజ్‌ల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఉందని, దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు విష్ణు మంచు.