Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు

తాజాగా ఈ రాడిసన్ ఘటనపై, నిహారిక పైన వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. నాగబాబు దీనిపై మాట్లాడుతూ ఓ వీడియో బైట్ ని మీడియాకి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.........

Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు

Nagababu (1)

 

Radisson Issue :  బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై రైడ్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు తాగుతూ, తూగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

పబ్‌ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంట్లో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి రాత్రే పంపించగా, మరికొంతమందిని విచారించి ఉదయం పంపించారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటంతో పాటు అక్కడి హోటల్ లో డ్రగ్స్ దొరకడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం ఆ ప్రముఖుల పిల్లలని విడిచిపెట్టినప్పుడు వారు వెళ్లిపోతుండగా మీడియాకి చిక్కారు. నాగబాబు కుమార్తె నిహారిక కూడా బయటకి వెళ్తూ కనిపించడంతో ఈ వార్త మరింత సంచలనంగా మారింది. నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి బయటకి వచ్చి వెళ్లిపోవడం బాగా వైరల్ అయింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిహారికపై వార్తలు రాస్తున్నారు.

Telangana : మద్యపానాన్ని నిషేధించాలి.. నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు

అయితే తాజాగా ఈ రాడిసన్ ఘటనపై, నిహారిక పైన వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. నాగబాబు దీనిపై మాట్లాడుతూ ఓ వీడియో బైట్ ని మీడియాకి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. ”గత రాత్రి రాడిసన్ పబ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపటం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు ఆమెది ఎలాంటి తప్పులేదు. పోలీసులు కూడా నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని సమాచారం ఇచ్చారు. సోషల్, టీవీ మీడియాలలో ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం కాకూడదనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా సైడ్ మేము చాలా క్లియర్ గా ఉన్నాము. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని నా విజ్ఞప్తి” అని తెలిపారు.